10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లే ట్యాబ్లెట్ సేల్ ప్రారంభం.. పూర్తి వివరాలు..!
రెడ్‌మి నుంచి జులై 29 న రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G ట్యాబ్లెట్ (Redmi Pad Pro 5G) విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. ఈ ప్యాడ్ వైఫై, 5G వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా మిడ్ రేంజ్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా లాంచ్ చేశారు. ఈ ట్యాబ్లెట్ 10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. షియోమీ వెబ్‌సైట్ Mi.com సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 2.5k 12 బిట్ స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆధారిత క్వాడ్ స్వీకర్లతో విడుదల అయింది. గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G 33W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 10000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 12 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOS ను కలిగి ఉంటుంది.
ఈ OS.. హోం స్క్రీన్+, షేర్‌డ్ క్లిప్‌బోర్డ్, హ్యాండ్ రైటింగ్‌ను గుర్తించే ఫీచర్, నెట్‌వర్క్ Sync, క్రాస్ డివైజ్ నోట్స్ యాప్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. వైఫై, 5G వేరియంట్లలో అందుబాటులోకి ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ +128 స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ప్యాడ్ ప్రో వెనుకవైపు 8MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. 5G వేరియంట్‌ను గ్రాఫైట్ గ్రే, క్విక్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. WiFi వేరియంట్‌ను మిస్ట్ బ్లూ, గ్రాఫైట్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఈ ట్యాబ్లెట్‌ను Mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు, ఇతర డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ట్యాబ్లెట్ బేస్ వేరియంట్‌ను రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చని సంస్థ తెలిపింది. రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G ట్యాబ్‌తోపాటు రెడ్‌మి ప్యాడ్ SE 4G ట్యాబ్లెట్ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది.
రెడ్‌మి ప్యాడ్ SE 4G స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి ప్యాడ్ SE 4G.. 8.7 అంగుళాల HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేటింగ్‌తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS, మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6,650mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. 8MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








