Home
Tablets

12.1 అంగుళాల డిస్‌ప్లే. 10000mAh బ్యాటరీతో రెడ్‌మి ప్యాడ్‌ విడుదల.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!

రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G (Redmi Pad Pro 5G), రెడ్‌మి ప్యాడ్‌ SE 4G (Redmi Pad SE 4G) లను భారత్‌ మార్కెట్‌లోకి సంస్థ ఇవాళ విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు శక్తివంతమైన ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. మిడ్‌ రేంజ్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ 5G, 4G ట్యాబ్లెట్‌లతోపాటు షియోమీ 14 సివీ లిమిడెట్‌ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది.

రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G స్పెసిఫికేషన్‌లు : 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 12.1 అంగుళాల 2.5k 12 బిట్‌ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాబ్లీ విజన్‌ మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను కలిగి ఉంటుంది.

Redmi Pad pro 5G  pad SE 4G launched

ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOS ను కలిగి ఉంటుంది. ఈ OS అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. హోం స్క్రీన్‌+, నెట్‌వర్క్ Sync, షేర్‌డ్‌ క్లిప్‌బోర్డ్‌, హ్యాండ్‌ రైటింగ్‌ను గుర్తించే ఫీచర్‌ సహా క్రాస్ డివైజ్‌ నోట్స్ యాప్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఈ ట్యాబ్లెట్‌ 33W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 10,000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 గంటల వరకు ప్లేబ్యాక్‌ బ్యాకప్‌ వస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుకవైపు 8MP కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G Wi-Fi, 5G వేరియంట్‌లలో విడుదల అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వైఫై వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. మరియు 8GB ర్యామ్‌ + 128GB 5G వేరియంట్‌ ధర రూ.24999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ 5G వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.

ఈ ప్యాడ్‌ సేల్‌ ఆగస్టు 2 నుంచి షియోమీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. 5G వేరియంట్‌లు గ్రాఫైట్‌ గ్రే, క్విక్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. అదే వైఫై వేరియంట్‌లు మిస్ట్‌ బ్లూ, గ్రాఫైట్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి ప్యాడ్‌ SE 4G స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి ప్యాడ్‌ SE 4G.. 90Hz రీఫ్రెష్‌ రేటింగ్‌తో 8.7 అంగుళాల HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ హీలియో G99 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6,650mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. దీంతోపాటు 8MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి ప్యాడ్ SE 4G... 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ ధర రూ.10,999 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మోడల్‌ ధర రూ.11,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఆగస్టు 8 నుంచి Mi.com, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Pad pro 5G and redmi pad SE 4G launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X