Home
Tablets

10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లే ట్యాబ్లెట్‌పై డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు..!

భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం జులై నెల చివరలో 5G ట్యాబ్లెట్‌ ను రెడ్‌మి తీసుకొచ్చింది. రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G ట్యాబ్లెట్ (Redmi Pad Pro 5G Tablet) పేరుతో లాంచ్‌ చేసింది. ఈ ట్యాబ్లెట్‌ Wi-Fi, 5G వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి ప్యాడ్ 12.1 అంగుళాల డిస్‌ప్లే, 10,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లె్ట్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

డిస్కౌంట్‌తోపాటు :
విడుదల సమయంలో రెడ్‌మి ప్యాడ్ ప్రో ట్యాబ్లెట్‌ ప్రారంభ ధర రూ.19,999 గా ఉండేది. ప్రస్తుత పండుగ సీజన్‌ సేల్‌ లో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.18999 నుంచే ఈ ట్యాబ్లెట్‌ ను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Redmi pad pro 5G tablet

రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G ట్యాబ్లెట్ ధరల వివరాలు :
రెడ్‌మి ప్యాడ్ ప్రో ట్యాబ్లెట్ 6GB/128GB (Wi-Fi) వేరియంట్ ధర రూ.18999, 8GB/128GB (Wi-Fi+ 5G) ధర రూ.21999, 8GB/256GB (Wi-Fi + 5G) ధర రూ.23999 గా ఉంది. గ్రాఫైట్‌ గ్రే, క్విక్‌ సిల్వర్‌ వంటి కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G ట్యా్బ్లెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ రెడ్‌మి 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 12.1 అంగుళాల 2.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. గొరెల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

Redmi pad pro 5G tablet

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ఇతర ఫీచర్‌లు :
ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOS పైన పనిచేస్తోంది. ఈ OS... హోం స్క్రీన్‌+, క్లిప్‌ బోర్డ్‌ వంటి ఫీచర్లతోపాటు హ్యాండ్‌ రైటింగ్‌ ను గుర్తించే ఫీచర్‌ కూడా ఉంది. క్రాస్ డివైజ్‌ నోట్స్ యాప్‌ ను కూడా కలిగి ఉంది.

10,000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G ట్యాబ్లెట్‌ వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ 33W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 10,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి, 12 గంటల ప్లేబ్యాక్‌ టైంను అందిస్తుందని రెడ్‌మి చెబుతోంది.

Redmi pad pro 5G tablet

రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G ట్యాబ్లెట్‌ నెట్‌ వర్క్ Sync ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో క్వాడ్‌ స్వీకర్లను కలిగి ఉంది. రెడ్‌మి స్మార్ట్‌ పెన్‌, కోబోర్డును సపోర్టు చేస్తుంది. అయితే ఈ రెండింటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X