10000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో 5G ట్యాబ్లెట్ .. విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ షియోమీ త్వరలో మరో ట్యాబ్‌ను లాంచ్ చేయనుంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G (Redmi Pad Pro 5G Tablet Launch Date) భారత్ మార్కెట్‌లో జులై 29 వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. భారత్‌లో లాంచ్ కానున్న ప్యాడ్ ప్రో స్పెసిఫికేషన్‌లు గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న ట్యాబ్ తరహా స్పెసిఫికేషన్‌లు ఉంటాయని సంస్థ తెలిపింది. ఈ ట్యాబ్లెట్ భారీ డిస్‌ప్లే సహా పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G స్పెసిఫికేషన్‌లు! :
రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G ట్యాబ్లెట్ 12.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 249 ppi, TUV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.

ఈ రెడ్‌మి ప్యాడ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ తో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 1.5TB వరకు పొడిగించుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్ 8MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ 33W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 10,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ద్వారా సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 12 గంటలపాటు వీడియో ప్లే బ్యాక్‌ను పొందవచ్చు.
ఈ రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G ట్యాబ్లెట్ రెండు వేరియంట్‌లలో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 128GB, 256GB స్టోరేజీలో లభిస్తుందని తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, GPS, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G సెల్యూలర్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ రెడ్‌మి ప్యాడ్ ధర పై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ట్యాబ్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో CNY 1999 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.22,970) గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2399 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.27,560) గా ఉంది. అయితే భారత్ వేరియంట్ ధరపై స్పష్టత రావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








