Home
Tablets

ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్‌మి ట్యాబ్లెట్‌ విడుదల.. పూర్తి వివరాలు..!

షియోమీ స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌ (xiaomi smarter living 2024) ప్రారంభం అయింది. ఈ ఈవెంట్‌ ద్వారా రెడ్‌మి ప్యాడ్‌ SE ట్యాబ్లెట్‌ను భారత్‌లో లాంచ్‌ చేశారు. ఈ ప్యాడ్‌ అనేక కీలక ఫీచర్‌లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 10W ఛార్జింగ్ సపోర్టుతో 8000mAh బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్ 680 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజీ ని కలిగి ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ SE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి ప్యాడ్‌ SE (Redmi Pad SE Launch) ట్యాబ్లెట్‌ 11 అంగుళాల WUXGA LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1920*1200 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్‌, 207 ppi పిక్సల్‌ డెన్సిటీతో ఈ ట్యాబ్లెట్‌ లాంచ్‌ అయింది.

Redmi Pad SE launched in india

ఈ రెడ్‌మి కొత్త ట్యాబ్లెట్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI Pad 14 పైన పనిచేస్తుంది. మరియు 6nm ఆక్టాకోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4x ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ ప్యాడ్‌ 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.

కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ప్యాడ్‌ SE f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్‌ 5.0 కనెక్టివిటీ మరియు వర్చువల్‌ యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, యాక్సిలిరోమీటర్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ SE ధర :
రెడ్‌మి ప్యాడ్ SE ను 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.12,999 గా ఉంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14,999 గా ఉంది. ఈ ట్యాబ్లెట్‌ బాడీని అల్యూమినియంతో తయారు చేశారు. గ్రాఫైట్‌ గ్రే, లావెండర్‌ పర్పల్‌, మింట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మి కొత్త ట్యాబ్లెట్‌ సేల్‌ వివరాలు :
రెడ్‌మి ప్యాడ్‌ SE ట్యాబ్లెట్‌ను ఏప్రిల్‌ 24 నుంచి షియోమీ రిటైల్‌ స్టోర్‌లు మరియు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Pad SE launched in india in xiaomi smarter living event 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X