Home
Tablets

శాంసంగ్‌ నుంచి ట్యాబ్లెట్‌.. 11 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్‌ స్పీకర్లు, 7040mAh బ్యాటరీ!

Samsung Galaxy Tab A11+ Tablet : శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ A11+ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలోనే అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో వైఫై, వైఫై + సెల్యూలర్‌ కనెక్టివిటీ వేరియంట్స్‌లో లాంచ్‌ అయింది. మొత్తంగా నాలుగు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. 7040mAh బ్యాటరీతోపాటు 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ A11+ స్పెసిఫికేషన్‌లు :
ఈ ట్యాబ్లెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 11 అంగుళాల TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ ట్యాబ్లెట్‌ ఆకట్టుకుంటుంది. ఈ ట్యాబ్లెట్‌ IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

samsung galaxy Tab A11  tablet launched in india telugu news

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
గెలాక్సీ ట్యాబ్లెట్ మీడియాటెక్ MT8775 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ ట్యా్బ్లెట్‌ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తుందని శాంసంగ్ తెలిపింది.

ఆటోఫోకస్‌ కెమెరా, 7040mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్‌ వెనుక వైపు ఆటోఫోకస్ సామర్థ్యంతో 8MP కెమెరాను కలిగి ఉంది. వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు 25W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7040mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ప్రత్యేక ఫీచర్‌ :
ఈ ట్యాబ్లెట్ ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. DeX మోడ్‌ ద్వారా PC గా మార్చుకోవచ్చు. అయితే ఇందుకోసం తగిన సామర్థ్యం కలిగిన మానిటర్‌ ఉండాలి. దీంతోపాటు మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ సౌకర్యంగా ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో క్వాడ్‌ కెమెరాలను కలిగి ఉంది.

samsung galaxy Tab A11  tablet launched in india telugu news

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ A11+ ట్యాబ్లెట్‌ ధర, సేల్‌ :
> ఈ ట్యాబ్లెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (Wi-Fi) ధర రూ.22999
> 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.26999

> 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.28,999
> 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.32,999
గెలాక్సీ ట్యాబ్‌ A11+ ట్యాబ్లెట్‌ ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ గ్రే, సిల్వర్‌ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

* శాంసంగ్‌ ట్రై ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో ఈ డిసెంబర్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన లీక్స్‌ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ Z ట్రై ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే, 10.0 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ సిరీస్‌ ప్రాసెసర్‌, 200MP ప్రైమరీ కెమెరా, 5437mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. తొలి దశలో కొరియా, ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ధర సుమారుగా USD 3000 (భారత కరెన్సీ ప్రకారం రూ.2,66,380) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
samsung galaxy Tab A11+ tablet launched in india here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X