Home
Tablets

10.1 అంగుళాల డిస్‌ప్లే, 10100mAh బ్యాటరీతో భారత్ లో శాంసంగ్‌ టాబ్లెట్‌ లాంచ్..!

Galaxy Tab Active5 Pro : శాంసంగ్ కంపెనీ తమ సరికొత్త గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్5 ప్రో (Galaxy Tab Active5 Pro)ను అధికారికంగా ప్రకటించింది. ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. రవాణా, ఫీల్డ్ వర్క్, రిటైల్ వంటి రంగాల్లో పనిచేసే వారికి ఇది ఒక నమ్మకమైన తోడుగా ఉండనుంది. దీనిలో 10.1 అంగుళాల పెద్ద స్క్రీన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

* మిలిటరీ గ్రేడ్ రక్షణ
ఈ గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్5 ప్రో కేవలం చూడటానికి మాత్రమే కాదు, నిజంగా చాలా గట్టిది. దీనికి MIL-STD-810H మిలిటరీ సర్టిఫికేషన్ ఉంది. అంటే, ఇది ఎత్తు నుంచి కింద పడినా, తీవ్రమైన వైబ్రేషన్స్, కఠినమైన ఉష్ణోగ్రతలకు కూడా తట్టుకుంటుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ (Corning Gorilla Glass Victus+) రక్షణ కల్పించారు.

Samsung Galaxy Tab Active5 Pro

కాబట్టి గీతలు, పగుళ్ల భయం తక్కువ. దీనికి IP68 రేటింగ్ ఉంది, టాబ్లెట్‌తో పాటు వచ్చే ఎస్ పెన్ (S Pen)కు కూడా IP68 రేటింగ్ ఉంది. వర్షంలో, దుమ్ము ఎక్కువగా ఉండే పరిశ్రమల ప్రాంతాల్లోనూ ధైర్యంగా వాడుకోవచ్చు. ఈ హార్డ్‌వేర్ ఫీచర్లే కాదు ఇందులో ఇంకా ఎన్నో అద్భుతమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అవేవో చూద్దాం.

* అద్భుతమైన డిస్‌ప్లే, సూపర్ ఫాస్ట్ పనితీరు
ఈ టాబ్లెట్‌లో 10.1 అంగుళాల WUXGA (1920 x 1200 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో కూడిన పెద్ద స్క్రీన్ ఉంది. చేతులకు గ్లోవ్స్ వేసుకున్నా సులభంగా ఆపరేట్ చేయడానికి 'గ్లోవ్ మోడ్' ఫీచర్ ఇచ్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 (Snapdragon 7s Gen 3) ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 720 GPU అమర్చారు.

వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి 6GB RAM + 128GB స్టోరేజ్ లేదా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. అంతేకాదు, మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, వన్ యూఐ 7 (One UI 7)లతో వస్తుంది.

* వ్యాపార నిపుణుల కోసం ప్రత్యేక ఫీచర్లు
వ్యాపార అవసరాల కోసం ఇందులో ముందు వైపు NFC ట్యాగింగ్ సపోర్ట్ ఉంది. ఇది వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీలకు ఉపయోగపడుతుంది. దీనిలో 'యాక్టివ్ కీ' (Active Key) బటన్‌ను నచ్చినట్లు మార్చుకోవచ్చు, తరచుగా వాడే యాప్స్, పనులను క్షణాల్లో యాక్సెస్ చేయవచ్చు. శాంసంగ్ నాక్స్ వాల్ట్ (Samsung Knox Vault) వంటి భద్రతా ఫీచర్లూ ఉన్నాయి.

* బ్యాటరీ, ఛార్జింగ్
ఈ టాబ్లెట్ 10,100mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది తీసివేయగలిగే (Removable) బ్యాటరీ, ఇంకా 'డ్యూయల్ హాట్-స్వాప్' (Dual hot-swap) సపోర్ట్ కూడా ఉంది. అంటే, టాబ్లెట్ పూర్తిగా ఆఫ్ చేయకుండానే ఒక బ్యాటరీని తీసి మరొకటి మార్చుకోవచ్చు. బ్యాటరీ మార్చే సమయంలో కొన్ని పనులు ఆగినా, మార్చిన వెంటనే స్క్రీన్ మళ్లీ ఆన్ అవుతుంది.


ఈ టాబ్లెట్ నిరంతరాయంగా పనిచేయడానికి పోగో (POGO) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వెనుకవైపు 13MP కెమెరా (LED ఫ్లాష్‌తో), ముందువైపు 8MP కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే, డ్యూయల్ సిమ్ (నానో + ఇసిమ్), 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్ వంటి అన్ని రకాల సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుంది.

* కొలతలు, బరువు, లభ్యత
ఇది యూఎస్‌బీ టైప్-సి 3.2 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లు, పోగో పిన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టాబ్లెట్ కొలతలు 170.2 x 242.9 x 10.2mm. వై-ఫై మోడల్ బరువు 680 గ్రాములు, 5G మోడల్ బరువు 683 గ్రాములు.

ధర విషయానికొస్తే, వై-ఫై వేరియంట్ ధర 699 యూరోలు (సుమారు రూ.68,120), 5G వేరియంట్ ధర 809 యూరోలు (సుమారు రూ. 78,840). ఇది మొదటగా 2025 ఏప్రిల్ 28న యూరప్‌లో, ఆ తర్వాత 2025, జూన్ ప్రారంభంలో అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో విడుదల గురించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab Active 5 Pro Launched with 10.1 Inches WUXGA Display 10100mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X