Home
Tablets

10.9 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh డిస్‌ప్లేతో శాంసంగ్‌ ట్యాబ్లెట్‌.. సేల్ ప్రారంభం..!

శాంసంగ్‌ ఇటీవల గ్లోబల్‌ మార్కెట్‌ లో లాంచ్‌ చేసిన శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్‌ ట్యాబ్లెట్‌ తాజాగా భారత్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మిడ్‌ రేంజ్‌ లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. 10.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 8000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ శాంసంగ్ ట్యాబ్లెట్ ఫీచర్లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్ పూర్తి వివరాలు :
ఈ ట్యాబ్లెట్‌ (Samsung Galaxy Tab S10 Lite) 10.9 అంగుళాల WUXGA TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్‌ బూస్టర్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.

samsung galaxy tab S10 lite tablet debuts in india

2TB వరకు స్టోరేజీ సపోర్టు :
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్ Exynos 1380 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్‌ తో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో గరిష్ఠంగా స్టోరేజీని 2TB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది.

8000mAh బ్యాటరీ సపోర్టు :
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరా, ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. గెలాక్సీ ట్యాబ్ S10 లైట్‌ స్మార్ట్‌ఫోన్ 8000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్‌ సపోర్టును వివరాలు తెలియాల్సి ఉంది.

స్టైలస్‌ సపోర్టు :
ఈ ట్యాబ్లెట్‌ S పెన్‌ స్టైలస్‌ ను సపోర్టు చేస్తుంది. స్టైలస్‌ ను ఉచితంగానే అందిస్తోంది. దీంతోపాటు గెలాక్సీ AI కీ తో కూడిన శాంసంగ్ బుక్‌ కవర్ కీబోర్డును కూడా సపోర్టు చేస్తుంది. అయితే ఈ కీబోర్డును ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

samsung galaxy tab S10 lite tablet debuts in india

థర్డ్‌ పార్టీ యాప్‌ సపోర్టు :
ఈ ట్యాబ్లెట్ గుడ్‌ నోట్స్, క్లిప్‌ స్టూడియో పెయింట్‌, లూమాఫ్యాషన్‌, నోషన్, స్కెచ్‌బుక్‌ సహా అనేక థర్డ్‌పార్టీ యాప్స్‌ ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ ను సిల్వర్, గ్రే, కొరాల్డ్ కలర్ వేరియంట్స్‌ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్‌ ధర, సేల్‌ వివరాలు :
గెలాక్సీ ట్యాబ్లెట్‌ S10 లైట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ( వైఫై ) ధర రూ.30,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ( వైఫై ) ధర రూ.40,999 గా ఉంది.

అదే గెలాక్సీ ట్యాబ్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ 5G వేరియంట్ ధర రూ.35999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ 5G వేరియంట్ ధర రూ.45999 గా ఉంది. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌, ఇతర ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ లు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

FAQs
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్ ఎలాంటి డిస్‌ప్లేను కలిగి ఉంది?

10.9 అంగుళాల WUXGA TFT డిస్‌ప్లేను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది?

6GB/128, 8GB/256GB రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 లైట్ ట్యాబ్లెట్ ఎన్ని వేరియంట్స్ లో లభిస్తుంది?

వైఫై, 5G వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

GizBot Technology
Best Mobiles in India

English summary
samsung galaxy tab S10 lite tablet debuts in india in wifi and 5G variants, sale is live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X