Home
Tablets

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ విడుదల.. ఆండ్రాయిడ్ 16 OS, మీడియాటెక్‌ చిప్‌సెట్, AI ఫీచర్లు!

Samsung Galaxy Tab S11 Series : శాంసంగ్ ఇవాళ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌ లో భాగంగా గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌తోపాటు గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ విడుదల అయింది. సిరీస్‌ లో గెలాక్సీ ట్యాబ్‌ S11, గెలాక్సీ ట్యాబ్‌ S11 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌సెట్‌ తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌ 16 OS కలిగి ఉంది.

గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
గెలాక్సీ ట్యాబ్‌ S11 ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. అల్ట్రా వేరియంట్‌ 14.6 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే యాంటీ రిఫ్లక్టివ్‌ కోటింగ్‌ ఆప్షన్‌ ను కలిగి ఉంది.

Samsung galaxy Tab S11 series launched

ఆండ్రాయిడ్ 16 OS :
ఈ సిరీస్ 3nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ సిరీస్‌ డెస్క్‌టాప్‌ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, జెమిని, గెలాక్సీ AI సూట్‌, స్కెచ్‌ టూ ఇమేజ్‌, నోట్‌ అసిస్ట్‌, డ్రాయింగ్‌ అసిస్టెంట్‌ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. శాంసంగ్‌ DeX ద్వారా హామ్‌ స్క్రీన్‌ షార్ట్‌ కట్‌, మల్టిపుల్‌ వర్క్‌ ప్లేసెస్‌, ఎక్స్‌టర్నల్‌ మానిటర్‌ను కూడా సపోర్టు చేస్తుందని సంస్థ చెబుతోంది.

Samsung galaxy Tab S11 series launched

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా గెలాక్సీ ట్యాబ్‌ S11 వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చి ఉంది. అదే అల్ట్రా వేరియంట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 13MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S11 ట్యాబ్లెట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 8,400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే అల్ట్రా వేరియంట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 11,600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌, GPS, వైఫై 7, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్‌ 5.5mm థిక్‌నెస్‌తో 469 గ్రాములుగా ఉంది. అదే అల్ట్రా వేరియంట్‌ 5.1mm థిక్‌నెస్‌తో 692 గ్రాముల బరువును కలిగి ఉంది.

ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S11 12GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi), 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్‌ ప్రారంభ ధర అమెరికాలో $800 (భారత కరెన్సీ ప్రకారం రూ.70,400) గా ఉంది.

అదే అల్ట్రా వేరియంట్ 256GB స్టోరేజీ (WiFi) ప్రారంభ ధర అమెరికాలో $1200 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,05,740) గా ఉంది. అదే 512GB స్టోరేజీ, 1TB స్టోరేజీ వేరియంట్స్‌లోనూ లభిస్తుంది. భారత్‌ మార్కెట్‌ ధర, సేల్‌ వివరాలు వెల్లడి కాలేదు.

Best Mobiles in India

English summary
Samsung galaxy Tab S11 series launched with mediatek dimensity 9400 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X