శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్ ధరలు వెల్లడి.. ముందస్తు బుకింగ్ వివరాలు..!
శాంసంగ్ ఇటీవల నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ట్యాబ్ S11, గెలాక్సీ ట్యాబ్ S11 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. విడుదల సమయంలో ఈ ట్యాబ్లెట్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ ట్యాబ్లెట్స్ ధర మరియు ముందస్తు బుకింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే సేల్ వివరాలు తెలియాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 (WiFi) 12GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.80999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi) ధర రూ.85999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ (WiFi) రూ.96999 గా ఉంది. గెలాక్సీ ట్యాబ్ S11 12GB ర్యామ్ + 128GB స్టోరేజీ (సెల్యూలర్) రూ.93999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ (సెల్యూలర్) ధర రూ.98999 గా ఉంది.

అదే గెలాక్సీ ట్యాబ్ S11 అల్ట్రా 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi) ధర రూ.1,10,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ (WiFi) ధర రూ.1,21,999 గా ఉంది. అదే సెల్యూలర్ వేరియంట్స్ 12GB/256GB ధర రూ.1,24,999, 12GB/512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,35,999 గా ఉంది.
శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా గెలాక్సీ S11 సిరీస్‌ను (Samsung Galaxy Tab S11 Series) ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ముందస్తు బుకింగ్ చేసుకొన్న వారికి 45W అడాప్టర్ ను ఉచితంగా అందించనుంది. 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.
గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్ పూర్తి వివరాలు :
ఈ సిరీస్ 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో గెలాక్సీ ట్యాబ్ S11 ట్యాబ్లెట్ 11 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. అల్ట్రా వేరియంట్ 14.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ట్యాబ్లెట్ సిరీస్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. శాంసంగ్ DeX ద్వారా హామ్ స్క్రీన్ షార్ట్ కట్, మల్టిపుల్ వర్క్ ప్లేసెస్, ఎక్స్‌టర్నల్ మానిటర్ సపోర్టును కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా బేస్ వేరియంట్ వెనుక వైపు 13MP కెమెరా, ముందువైపు 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. అల్ట్రా వేరియంట్ వెనుక వైపు 13MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ కెమెరా మరియు ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యా్బ్ S11 ట్యాబ్లెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 8,400mAh బ్యాటరీ, అల్ట్రా వేరియంట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 11,600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ సిరీస్ సర్కిల్ టూ సెర్చ్, జెమిని, గెలాక్సీ AI సూట్, Sketch to image, Note Assist, డ్రాయింగ్ అసిస్టెంట్ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications