Home
Tablets

Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు 

శాంసంగ్ సంస్థ నుంచి Galaxy Tab S6 Lite (2024) మోడల్ ఆన్‌లైన్‌లో జాబితా చేయబడింది. Galaxy Tab S6 Lite యొక్క రిఫ్రెష్ మోడల్ ప్రపంచ మార్కెట్లో కొన్ని ప్రాంతాలలో అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ టాబ్లెట్ పేర్కొనబడని కొత్త చిప్‌సెట్‌తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 14-ఆధారిత UIతో పనిచేస్తుంది.

శాంసంగ్ యొక్క Gelaxy Tab S6 Lite (2022) మోడల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత One UI 4 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో షిప్పింగ్ చేయబడింది మరియు ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 720G ద్వారా అందించబడింది. ఈ కొత్త 2024 వేరియంట్ డిజైన్ పరంగా ఈ మోడల్ యొక్క పాత వెర్షన్‌లను పోలి ఉంటుంది. ఇండియాలో కూడా త్వరలో లాంచ్ అవుతుందని అంచనాలున్నాయి.

Samsung Galaxy Tab S6 Lite 2024

శాంసంగ్ Gelaxy Tab S6 Lite (2024) ప్రస్తుతం శాంసంగ్ యొక్క రొమేనియా వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. ఇది Wi-Fi మరియు LTE వేరియంట్‌లలో అందించబడుతుంది మరియు 4GB + 64GB RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో వస్తుంది. ఇది గ్రే మరియు మింట్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. అయితే, ఈ వెబ్‌సైట్ టాబ్లెట్ ధరను ఇంకా జాబితా చేయలేదు. ఈ టాబ్లెట్ శాంసంగ్ యొక్క ఐర్లాండ్ వెబ్‌సైట్‌లో కూడా జాబితా చేయబడింది.

Samsung Galaxy Tab S6 Lite (2024) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు
గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ (2024) మోడల్ 10.4-అంగుళాల WUXGA+ (2,000 x 1,200 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో జాబితా చేయబడింది. ఇది 2.4GHz మరియు 2.0GHz క్లాక్ స్పీడ్‌లతో పేరు ప్రకటించని చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

మునుపటి లీక్ ల ఆధారంగా, ఇది అంతర్గత Exynos 1280 SoC గా అంచనా వేయబడింది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని అమలు చేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ (2024) వెనుకవైపు ఆటోఫోకస్ సపోర్ట్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్‌లో వెనుక ఫ్లాష్ యూనిట్ లేదు కానీ పూర్తి-HD (1,980 x 1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వద్ద వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. దీనికి S-పెన్‌ మద్దతు కూడా ఉంది.

గెలాక్సీ ట్యాబ్ S6 లైట్(2024) టాబ్లెట్ 7,040mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 14 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుందని పేర్కొంది. ఇది Wi-Fi, GPS, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ను పొందుతుంది. ఈ టాబ్లెట్ బరువు 465g మరియు పరిమాణం 244.5mm x 154.3mm x 7mm కొలతలతో ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab S6 Lite (2024) With 10.4 Inch Display, Android 14 And 7040mAh Battery Launched. Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X