Home
Tablets

శాంసంగ్‌ నుంచి కొత్త ట్యాబ్లెట్స్‌.. IP68 రేటింగ్‌, AI ఫీచర్లు, S Pen సహా సూపర్ ఫీచర్‌లు..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌ మార్కెట్‌లో గెలాక్సీ ట్యాబ్‌ S10 FE మరియు గెలాక్సీ ట్యాబ్‌ S10 FE+ ట్యాబ్లెట్స్‌ విడుదల అయ్యాయి. ఈ రెండు ట్యాబ్లెట్స్‌ (Samsung Galaxy Tab S10 FE Series) ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. భారీ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. మరియు తొలిసారిగా AI ఫీచర్‌లను జతచేశారు. మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్యాబ్లెట్స్‌ తో S Pen ను కూడా అందిస్తున్నారు.

డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 FE ట్యాబ్లెట్‌ ధర 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 10.9 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ ట్యాబ్‌ S10 FE+ ట్యాబ్లెట్‌ 13.1 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ట్యాబ్లెట్స్‌ 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి.

Samsung launched Galaxy Tab S10 FE Series tablets in india

చిప్‌సెట్ వివరాలు :
ఈ రెండు గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్‌ Exynos 1580 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. గరిష్ఠంగా ఈ ట్యాబ్లెట్స్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పొడిగించుకొనే ఆప్షన్‌ ఉంది. తొలిసారిగా శాంసంగ్ ట్యాబ్‌ FE సిరీస్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌ :
గెలాక్సీ ట్యాబ్‌ S10 FE 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 8,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే ప్లస్ మోడల్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,090mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

IP68 రేటింగ్‌ :
కెమెరా విభాగం పరంగా ఈ రెండు ట్యాబ్లెట్స్‌ వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ శాంసంగ్‌ కొత్త ట్యాబ్లెట్స్ IP68 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

డేటా ప్రొటెక్షన్‌ కోసం శాంసంగ్‌ Knox సెక్యూరిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Best Face, Object Eraser, slove math వంటి అదనపు ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ సిరీస్‌ క్లిప్‌ స్టూడియో పెయింట్‌, గుడ్‌నోట్స్‌, లుమాఫ్యూజన్‌ వంటి యాప్స్‌ ప్రీ ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్‌లు S Pen కూడా అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 FE సిరీస్‌ ధర :
భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ S10 FE ప్రారంభ ధర రూ.42999 గా ఉంది. అదే గెలాక్సీ ట్యాబ్‌ S10 FE+ ప్రారంభ ధర రూ.53999 గా ఉంది. ఈ రెండు ట్యాబ్లెట్‌లు గ్రే, బ్లూ, సిల్వర్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తాయి. ఇవాళ్టి నుంచి ఈ ట్యాబ్లెట్స్‌ సేల్ అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ S10 FE 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (వైఫై) ధర రూ.42999, 8GB ర్యామ్ + 128GB (వైఫై + 5G) ధర రూ.50999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (వైఫై) రూ.53999. 12GB ర్యామ్‌ + 256GB రూ.61999 (వైఫై + 5G) గా ఉంది.

గెలాక్సీ ట్యాబ్‌ S10 FE+ ట్యాబ్లెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (వైఫై) ధర రూ.55999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (వైఫై + 5G) రూ.63999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (వైఫై) రూ.65999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ (వైఫై + 5G) ధర రూ.73999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung launched Galaxy Tab S10 FE Series tablets in india with AI features and S Pen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X