Samsung గెలాక్సీ Tab S9 సీరిస్ విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ బుధవారం అన్ ప్యాకెడ్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోల్డ్ ఫోన్ సహా ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ S9 సీరిస్ ట్యాబ్‌లను విడుదల చేసింది. ఈ సీరిస్‌లో S9, S9+, S9 ఆల్ట్రా ట్యాబ్‌లు ఉన్నాయి. క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో రానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సీరిస్ ధర : శాంసంగ్ తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ట్యాబ్ S9 సీరిస్ ప్రారంభ ధర అమెరికాలో $799 (భారత్ కరెన్సీలో రూ.65.540) గా ఉంది. అమెరికాలో ముందస్తు బుకింగ్‌లు కూడా ప్రారంభించింది. అయితే భారత్‌లో ఈ S9 ట్యాబ్ సీరిస్ ధరలు వెల్లడించలేదు. ఈ వివరాలు ఇవాళ వెల్లడించే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సీరిస్ వేర్వేరు డిస్‌ప్లే సైజ్, బ్యాటరీ, కెమెరాలను కలిగి ఉంటాయి. అయితే ఈ సీరిస్ ట్యాబ్‌లు అన్ని కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్2 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సీరిస్ డివైస్‌లు 5G కనెక్టివిటీ, LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3తో రానున్నాయి.
గెలాక్సీ ట్యాబ్ S9 స్పెసిఫికేషన్లు : ఈ ట్యాబ్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 8,400mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ట్యాబ్ వెనుక వైపు 13MP కెమెరా, ముందువైపు 12MP కెమెరాను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

గెలాక్సీ ట్యాబ్ S9+ : ఈ ట్యాబ్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 12.4 అంగుళాల WQZGA+ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,090mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ట్యాబ్ వెనుక వైపు 13MP+ 8MP కెమెరాలతో వస్తుంది. ముందు వైపు 12MP ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాలను కలిగి ఉంటుంది. 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 ఆల్ట్రా : ఈ ఆల్ట్రా మోడల్ ట్యాబ్ 14.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ WQXGA+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 11,200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ 13MP+8MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది.
ముందు వైపు 12MP+ 12MP కెమెరాలతో వస్తుంది. 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 512GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్+ 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్లతో ఈ ట్యాబ్ లభిస్తుంది. ఈ ట్యాబ్‌ల ధరలు ఇవాళ విడుదల కానున్నాయి.
గెలాక్సీ S9 సీరిస్ ట్యాబ్‌లు డిస్‌ప్లే పైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి. AKG, డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్టీరియో స్పీకర్లతో వస్తాయి. గెలాక్సీ ట్యాప్ S9, S9+ S9 ఆల్ట్రా ట్యాబ్‌లు బీజ్, గ్రాఫైట్ రంగుల్లో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








