Home
Tablets

సామ్‌సంగ్ సంచలన నిర్ణయం..?

By Sivanjaneyulu

సామ్‌సంగ్ ఇండియా ఈ వారం సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌కు సంబంధించి ఇప్పటి వరకు సామ్‌సంగ్ ఏ విధమైన వివరాలను అధికారికంగ ప్రకటించలేదు.

 సామ్‌సంగ్ సంచలన నిర్ణయం..?

మార్కెట్ ఇన్‌సైడర్స్ చెబుతోన్న దాని ప్రకారం ఈ డివైస్ సామ్‌సంగ్ తొలి మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ కాబోతోందని తెలుస్తోంది. టాబ్ అనధికారిక స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 7 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఆప్షన్స్ (వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ).

Read More : డిస్‌ప్లే దెబ్బతిన్న ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయటం ఎలా?

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్‌ను బయుంగ్ - చుల్ లీ అనే వ్యక్తి 1938లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ సంస్థ కొరియా నుంచి చైనాకు ఎండుచేపలు, కూరగాయలు ఇంకా పిండి పదార్థాలను ఓడల సాయంతో ఎగుమతి చేసేది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్‌సంగ్ చెయిల్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్‌డాంగ్ బ్యాంక్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్‌సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్‌సంగ్ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టంది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్‌సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్‌ అండ్ వైట్ టీవీని సామ్‌సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్‌సంగ్ అదేసంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్‌లు, వీ.సీ.ఆర్‌లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్‌సంగ్ 1990 మధ్య మెమరీ కార్డులతో పాటు హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

1995లో సామ్‌సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్‌లను ధ్వంసం చేయించారు.

 

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

మొబైల్ ఫోన్‌ల తయారీని సీరియస్‌గా తీసుకన్న సామ్ సంగ్ 1999లో ఇంటర్నెట్‌కు అనువైన ఫోన్‌లను తయారు చేసింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

 ఓ వైపు మొబైల్ ఫోన్ మరోవైపు టెలివిజన్‌ల తయారీ పై దృష్టిపెట్టిన సామ్‌సంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది. 1999లో వీటి ఉత్పత్తి ప్రారభమైంది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

2000వ సంవత్సరం హైడెఫినిషన్ టీవీని సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది.

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు ‘గెలాక్సీ ఎస్'. 2010లోనే 7 అంగుళాల గెలాక్సీ సిరీస్ ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ విడుదల చేసింది.

 

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర

2013లో ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ టీవీలతో పాటు డిస్‌ప్లేలను సామసంగ్ పరిచయం చేసింది.

Best Mobiles in India

English summary
Samsung to launch 7-inch ‘Made in India’ tablet with 1.5GB RAM. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X