ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ ట్యాబ్లెట్.. ఈ నెలలోనే విడుదల..!
Samsung Galaxy Tab A11+ : ప్రముఖ సంస్థ శాంసంగ్ త్వరలో భారత్ మార్కెట్ లో గెలాక్సీ ట్యాబ్ A11+ ను విడుదల చేయనుంది. ఈ నెలలోనే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ శాంసంగ్ ట్యాబ్లెట్ అనేక గెలాక్సీ AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ విద్యార్థుల రోజువారీ టాస్క్‌లను సులభంగా పూర్తిచేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ ట్యాబ్లెట్ 4nm మీడియాటెక్ MT8775 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ లో అంబాటులోకి వస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీ పొడిగించుకోవచ్చు.

AI ఫీచర్లు :
ఈ నెలలోనే లాంచ్ కానుందని భావిస్తున్న శాంసంగ్ ట్యాబ్లెట్ గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ సహా మరిన్ని ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ ద్వారా ఈ విభాగం మరింత బలపడుతుందని శాంసంగ్ భావిస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతోపాటు స్టోరేజీ సహా ఇతర ఫీచర్లు ఈ ట్యాబ్లెట్ ను ప్రత్యేకంగా నిలుపుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు డిస్‌ప్లే, కెమెరాలు, బ్యాటరీ సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఈ గెలాక్సీ ట్యాబ్లెట్ ఈనెలలోనే భారత్ మార్కెట్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. మరియు ఎంత ధర సెగ్మెంట్ లో విడుదల కానుంది. ఏయే ప్లాట్‌ఫాంలలో సేల్ ప్రారంభం కానుంది, వంటి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ కోసం ఇటీవల వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Z TriFold పేరుతో విడుదల కానుంది. ఈ ఫోన్ తొలుత పరిమిత సంఖ్యలో, ఎంపిక చేసిన మార్కెట్స్ లోనే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల లీక్ అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ సిరీస్ చిప్‌సెట్ లో విడుదల కానుంది.
ఈ గెలాక్సీ ఫోన్ 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో 10.0 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 5437mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గెలాక్సీ ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 5 వ తేదీన గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుందని ఇటీవల లీక్స్ వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే భారత్ మార్కెట్‌లో తొలి దశలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. మరియు ఈ ఫోన్ ధర సుమారుగా USD 3000 (భారత కరెన్సీ ప్రకారం రూ.2,66,380) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








