Home
Tablets

10.1 అంగుళాల HD+ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Megapad 10 ట్యాబ్లెట్‌.. పూర్తి వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ టెక్నో ఇవాళ టెక్నో మెగాప్యాడ్‌ 10 ను (Tecno Megapad 10) ఆవిష్కరించింది. డిజైన్ పరంగా ఈ టెక్నో ప్యాడ్‌ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు మెగాప్యాడ్‌ 10 ట్యాబ్లెట్‌ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టెక్నో ట్యాబ్లెట్‌ స్ప్లిట్‌ స్క్రీన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ టెక్నో ట్యాబ్లెట్‌ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 8 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని టెక్నో వెల్లడించింది.

టెక్నో మెగాప్యాడ్‌ 10 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
టెక్నో కొత్త ట్యాబ్లెట్‌ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మెగాప్యాడ్ 10.. 10.1 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 80 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో, 450 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లే, 800*1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ తో అందుబాటులోకి రానుంది.

tecno Megapad 10 unveiled

మెగాప్యాడ్‌ 10 ఫీచర్‌లు :
ఈ ట్యాబ్లెట్‌ను వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లోనూ సౌకర్యవంతంగా వినియోగించుకొనేలా Eye కంఫర్ట్‌ మోడ్‌, డార్క్ మోడ్‌తో వస్తుంది. మరియు Split Screen మరియు ShapeFlex Snip ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

ఈ మెగాప్యా్డ్‌ 10.. మీడియాటెక్‌ హీలియో G80 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS (స్కిన్‌ టూ టాప్) ను కలిగి ఉంటుంది. టెక్నో వెబ్‌సైట్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ మెగాప్యాడ్‌ 128GB మరియు 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

tecno Megapad 10 unveiled

13MP + 5MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ టెక్నో ట్యాబ్లెట్‌ వెనుకవైపు 13MP కెమెరాను అమర్చారు. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ మెగాప్యాడ్‌ 10.. 5MP కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ బరువు 447 గ్రాములుగా ఉంది.

8 గంటలపాటు వినియోగించుకోవచ్చు..!
ఈ టెక్నో మెగాప్యాడ్‌ 10... 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 2.5 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది. అయితే సింగిల్‌ ఛార్జింగ్‌తో 8 గంటలపాటు (Video Playback) వినియోగించుకోవచ్చు.

కనెక్టివిటీ ఫీచర్‌లు :
కనెక్టివిటీ పరంగా ఈ టెక్నో ప్యాడ్‌ 4G LTE, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. టెక్నో అధికారిక లిస్టింగ్‌ ఆధారంగా ఈ మెగాప్యాడ్‌ 10 రెండు రంగుల్లో లభిస్తుంది. Champagne Gold, Space Grey రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ టెక్నో మెగాప్యాడ్‌ 10 స్టోరేజీ వేరియంట్‌ లు, ధర సహా ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. అయితే కచ్చితంగా ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తుందో టెక్నో సంస్థ వెల్లడించలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
tecno Megapad 10 unveiled with 7000mAh Battery and 10.1 inch display in global markets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X