షియోమీ ప్యాడ్ 7 ట్యాబ్లెట్ విడుదల సహా కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్..!
షియోమీ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ లో చైనా మార్కెట్ లోకి ప్యాడ్ 7, ప్యాడ్ 7 ప్రో విడుదల అయ్యాయి. అయితే ఈ ప్యాడ్ భారత్ మార్కెట్ లోనూ లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లో ఇటీవల షియోమీ ప్యాడ్ 7 కనిపించింది. అయితే తాజాగా గీక్‌బెంచ్ లో కూడా ఈ ట్యాబ్లెట్ ను గుర్తించారు. అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా జనవరి నెలలో ఈ ట్యాబ్లెట్ భారత్ మార్కెట్ లో విడుదల కానుంది.
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon) ఆధారంగా షియోమీ ప్యాడ్ 7 (Xiaomi Pad 7 Tablet) భారత్ మార్కెట్ లో 2025 జనవరి 10 వ తేదీన లాంచ్ కానుంది. 2023 జూన్ లో విడుదల అయిన షియోమీ ప్యాడ్ 6 తర్వాత తరం వెర్షన్ గా విడుదల కానుంది. చైనా వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

షియోమీ ప్యాడ్ 7 ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
షియోమీ ప్యాడ్ 7 చైనా వేరియంట్ 11.2 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ డిస్‌ప్లే 2136*3200 పిక్సల్స్ రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తోంది.
షియోమీ ప్యాడ్ 7 స్టోరేజీ వివరాలు : ఈ ప్యాడ్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ను (Skin on Top) కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. చైనాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది.
షియోమీ ప్యాడ్ 7 ధర : చైనా మార్కెట్‌లో ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర CNY 1999 (భారత కరెన్సీ ప్రకారం రూ.23,500) గా ఉంది. మిగిలిన వేరియంట్‌ల ధరలు CNY 2299 (భారత కరెన్సీ ప్రకారం రూ.27,700), CNY 2599 (భారత కరెన్సీ ప్రకారం రూ.30,600) గా ఉంది.
కెమెరా విభాగం పరంగా షియోమీ ప్యాడ్ 7 చైనా వేరియంట్ వెనుక వైపు 13MP కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 8850mAh బ్యాటరీతో పనిచేస్తోంది. చైనా మార్కెట్ లో గ్రీన్, బ్లాక్, బ్లూ రంగుల్లో లభిస్తోంది.
అయితే ఇప్పటి వరకు ఉన్న వివరాల ఆధారంగా చైనా వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లనే భారత్ మోడల్ కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే విడుదల సమయం దగ్గర పడే కొద్ది మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చైనాలో ప్రో మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో బేస్ వేరియంట్ మాత్రమే విడుదల కానుందని తెలుస్తోంది. అమెజాన్ ద్వారా సేల్ జరగనుంది.


Click it and Unblock the Notifications








