రూ.3 వేల డిస్కౌంట్‌తో ఇవాళ్టి నుంచే ట్యాబ్లెట్ సేల్.. 9200mAh బ్యాటరీ, 3.2k డిస్‌ప్లే..!
Xiaomi Pad 8 Tablet Sale : భారత్ మార్కెట్ లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ షియోమీ నుంచి ఇటీవల షియోమీ ప్యాడ్ 8 ట్యాబ్లెట్, షియోమీ 17 సిరీస్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఈ ట్యాబ్లెట్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్యాబ్లెట్ 11.2 అంగుళాల డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీని కలిగి ఉంది. తొలి సేల్ లో భాగంగా డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది.
నెలాఖరు వరకు ప్రత్యేక ఆఫర్లు :
షియోమీ ప్యాడ్ 8 సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా వెబ్‌సైట్, షియోమీ రిటైల్, భాగస్వామ్య స్టోర్‌లతోపాటు అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్చి 17 వ తేదీ నుంచి 31 వరకు తొలి సేల్ ఆఫర్లు ఉంటాయని షియోమీ తెలిపింది.

షియోమీ ప్యాడ్ 8 ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.36999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (నానో టెక్చర్ డిస్‌ప్లే) ధర రూ.38999 గా ఉంది. దీంతోపాటు క్రియేటర్ ఎడిషన్ సేల్ కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది.
ఈ ట్యాబ్లెట్ క్రియేటర్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.41999, ఇందులోనూ నానా టెక్చర్ డిస్‌ప్లే వేరియంట్ అందుబాటులో ఉంది. ధర రూ.43999 గా ఉంది. SBI క్రెడిట్ కార్డుపై కొనుగోలుపై రూ.3 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ నెలాఖరులోగా కొనుగోలు చేసిన వారికి బ్యాటరీ మినహా ట్యాబ్లెట్ పై సంవత్సరం వారంటీని అందిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్ :
షియోమీ ప్యాడ్ 8 ట్యాబ్లెట్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 11.2 అంగుళాల 3.2k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 345ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ప్యాడ్ డాల్బీ విజన్, HDR10 ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది.
9200mAh బ్యాటరీ :
షియోమీ ప్యాడ్ 8.. 45W టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 9200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. AI రైటింగ్ అసిస్టెంట్, AI క్రియేషన్ టూల్స్ ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలిరోమీటర్, గైరోస్కో్ప్, మాగ్నిటిక్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ లు ఉన్నాయి. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్, Hi Res ఆడియో సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లు ఉన్నాయి. టైటానియం బ్లూ, గ్రాఫైట్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








