షియోమీ ప్యాడ్ 6S ప్రో యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ టాబ్లెట్‌లో విండోస్ PC గేమ్స్ ఆడుకోవచ్చు..
Xiaomi WinPlay: షియోమీ సరికొత్త ఫీచర్‌తో గేమింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అదే విన్‌ప్లే ఇంజన్. దీని ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో PC గేమ్స్‌ను ఆడుకోవచ్చు. ఈ ఫీచర్ హైపర్OSతో సజావుగా కలిసి పనిచేస్తుంది. క్లౌడ్ గేమింగ్ లా కాకుండా, ఇది గేమ్స్ ఆడటానికి ఇంటర్నెట్ కనెక్షన్ అస్సలు అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ షియోమీ ప్యాడ్ 6S ప్రో 12.4 మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.
షియోమీ మొబైల్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డైరెక్టర్ జాంగ్ గువోక్వాన్ తెలిపిన వివరాల ప్రకారం, విన్‌ప్లే టాబ్లెట్‌లో ఒక వర్చువల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది PC గేమ్స్‌ను సపోర్ట్ చేస్తూ, మంచి పెర్ఫార్మెన్స్, స్టెబిలిటీని అందిస్తుంది. యూజర్లు స్టీమ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా నేరుగా టాబ్లెట్‌లోకి డౌన్‌లోడ్ చేసి ఆడుకోవచ్చు.

* క్రాస్-ప్లాట్‌ఫామ్ సపోర్ట్
విన్‌ప్లే మౌస్, కీబోర్డ్, కన్సోల్ కంట్రోలర్ వంటి గేమింగ్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, నలుగురు ప్లేయర్స్ కలిసి ఆడుకునే మల్టీప్లేయర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడొచ్చు. ఇది క్లౌడ్ గేమింగ్ సర్వీస్ కాదు. విన్‌ప్లే వర్చువలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి విండోస్ గేమ్స్‌ను నేరుగా టాబ్లెట్‌లోనే రన్ చేస్తుంది.
కాబట్టి, గేమ్స్ ఆడటానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. షియోమీ తెలిపిన వివరాల ప్రకారం, విన్‌ప్లే వల్ల GPU పెర్ఫార్మెన్స్ కేవలం 2.9% మాత్రమే తగ్గుతుంది. ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, షావోమి ప్యాడ్ 6S ప్రో విండోస్ గేమ్‌లను Xbox కంట్రోలర్‌తో రన్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు.
టాంబ్ రైడర్ వంటి గేమ్స్ యావరేజ్‌గా 45 FPS వద్ద రన్ అయ్యాయి. ఇది బెస్ట్ ఫ్రేమ్ రేట్ కాకపోయినా, గేమ్స్ ఆడుకోవడానికి ఓకే. విన్‌ప్లే ఇంటెలిజెంట్ రిసోర్స్ అలకేషన్‌ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా సిస్టమ్ లోడ్ తగ్గి, గేమ్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. గేమ్ లోడింగ్ నుంచి రెండరింగ్ వరకు, అంతా స్మూత్‌గా ఉంటుంది.
* టెస్టింగ్, గ్లోబల్ రిలీజ్
ప్రస్తుతం చైనాలో విన్‌ప్లే కోసం ఇంటర్నల్ టెస్టర్స్‌ను షియోమీ నియమిస్తోంది. గ్లోబల్ రిలీజ్ డేట్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఇదిలా ఉండగా, షియోమీ ప్యాడ్ 7 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. అంతేకాకుండా, చాలా ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.
ఈ ట్యాబ్లెట్‌లో LCD డిస్‌ప్లే, AI-పవర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఐప్యాడ్ ప్రోలో ఉన్నట్టుగానే నానో డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి మిడ్-రేంజ్ టాబ్లెట్ ఇదే. దీన్ని కొనుగోలు చేసిన వారు శామ్‌సంగ్ మిడ్ రేంజ్, ప్రీమియం ట్యాబ్లెట్స్‌లో చేయగలిగిన పనులన్నీ చేయొచ్చు. స్టూడెంట్స్‌కి ఇది బాగా నచ్చుతుంది.
అమెజాన్ వెబ్‌సైట్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 4nm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2తో ఇది ల్యాగ్ ఫ్రీ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది
ఇమ్మర్సివ్ స్టీరియో సౌండ్ కోసం 6 స్పీకర్లు
డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. 10000mAh బ్యాటరీతో వస్తుంది.


Click it and Unblock the Notifications








