ప్రపంచంలోనే మొదటి AR లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ విడుదల,ఈ జులై 21 న సిద్ధం కండి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వినియోగదారులకు ఎల్లప్పుడూ అద్భుతమైన సమర్పణలతో స్మార్ట్‌ఫోన్‌లను అందించింది. ఈ సంస్థ దాని ప్రధాన వన్‌ప్లస్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ఆవిష్కరణలోను మరియు నాణ్యతలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. ఇప్పుడు రాబోయే వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌తో అదే నాణ్యమైన యూజర్ అనుభవాన్ని ప్రజలకు అందించాలని కంపెనీ నిర్ణయించింది.ప్రపంచంలోని మొదటి AR లాంచ్ కార్యక్రమంలో జూలై 21 న రాత్రి 7.30 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వినూత్నమైన లాంచ్ ఈవెంట్‌ను అనుభవించడానికి వినియోగదారుల కోసం ఈ బ్రాండ్ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను సృష్టించింది. ప్రత్యేకంగా సృష్టించిన యాప్ వినియోగదారులకు AR టెక్నాలజీ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ యొక్క అనుభవాన్ని అందిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ ఆహ్వానం అమెజాన్.ఇన్‌లో కేవలం రూ. 99 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది మీ గదిలో సౌకర్యవంతంగా వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా AR లాంచ్ ఆహ్వానాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు ముఖ్యముగా అమెజాన్‌లో 'లాంచ్ డే లాటరీ' లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది.వన్‌ప్లస్ నార్డ్ AR యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తుంది. ప్రపంచంలోని మొట్టమొదటి AR ప్రోడక్ట్ లాంచ్ ను ట్యూన్ చేసే పద్ధతులు.
** వన్‌ప్లస్ నార్డ్ AR యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
** యాప్ ను ఇన్‌స్టాల్ చేయండి మరియు AR అనుభవానికి అవసరమైన అనుమతులను అంగీకరించండి.
** మీ అవతార్ మరియు యాప్ ని సెటప్ చేయడానికి యాప్ ను ప్రారంభించండి మరియు సూచనలను అనుసరించండి.
** WEB AR అనుభవాన్ని ప్రారంభించడానికి ఆహ్వానంలో QR కోడ్‌ను స్కాన్ చేయండి. మీ యొక్క కెమెరా యాప్ (ఆండ్రాయిడ్ 9 మరియు 10 సంస్కరణలలో), గూగుల్ లెన్స్ లేదా ఏదైనా QR కోడ్ స్కానర్‌తో QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.
**మీరు WEB AR అనుభవాన్ని లోడ్ చేసిన తర్వాత రాబోయే వన్‌ప్లస్ నార్డ్ డివైస్ యొక్క AR ఆహ్వానాన్ని స్కాన్ చేసి అనుభవించవచ్చు.
ప్రపంచంలోని మొట్టమొదటి AR లాంచ్ ఈవెంట్‌ను మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు లాంచ్ రోజున ఈవెంట్ యొక్క కార్యకలాపాలను కోల్పోకుండా ఉండటానికి ఈ దశలను అనుసరించండి. అంతేకాకుండా మీరు అమెజాన్.ఇన్‌లో నోటిఫై మీ మీద క్లిక్ చేయాలి లేదా లాంచ్ ఈవెంట్ మరియు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌పై అన్ని ముఖ్యమైన అప్ డేట్ ల కోసం వన్‌ప్లస్ నార్డ్ ఇన్‌స్టాగ్రామ్ (@ oneplus.nord) మరియు వన్‌ప్లస్ నార్డ్ AR వెబ్‌సైట్ (nord.oneplus.com) ను ఫాలో అవ్వవచ్చు.
AR యాప్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ డేట్ మరియు సమయం
** 21 జూలై 2020 న రాత్రి 7.30 గంటల సమయానికి వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ ఓపెన్ అవుతుంది.
** AR యాప్ను ఓపెన్ చేసి లీనమయ్యే AR అనుభవాన్ని ప్రారంభించడానికి తెరపై కనిపించే సూచనలను అనుసరించండి.
** స్థిరమైన AR స్ట్రీమింగ్ అనుభవాన్ని పొందడానికి మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం తప్పనిసరి.
అమెజాన్.ఇన్‌లో ప్రీ-ఆర్డర్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ ను బుక్ చేయడానికి ఇప్పటికే అందుబాటులో ఉంది. మీరు కేవలం రూ.499 చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అనుభవాన్ని సరసమైన ధర వద్ద తీసుకువస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండి ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ కెమెరా హార్డ్‌వేర్‌ను ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








