వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
వన్‌ప్లస్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. వన్‌ప్లస్ సంస్థ చాలా కాలం నుంచి లాంచ్ చేయాలని చూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. వన్‌ప్లస్ సంస్థ తన ఇతర వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే తాజా వన్‌ప్లస్ నార్డ్ ను కూడా కొనుగోలు చేయడానికి ప్రీ-ఆర్డర్ జాబితాలో ఉంచింది.

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్స్ జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి అమెజాన్‌లో మొదలు అవుతున్నాయి. పరిమిత సంఖ్యలో విడుదలయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ను ముందస్తు ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు కొన్ని ఆశ్చర్యకరమైన బహుమతులు కూడా అదనంగా అందుకుంటారు. అలాగే ఆగస్టు 31 లోగా వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులు కూడా సంస్థ అందిస్తున్న ఆశ్చర్యకరమైన బహుమతులతో రెండవ బహుమతి బాక్స్ ను పొందవచ్చు.
ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఆర్డర్ చేయడం ఎలా?
1. వినియోగదారులు మొదట Amaazon.in ని ఓపెన్ చేయాలి.
2. తరువాత ఇందులో ప్రీ-ఆర్డర్ వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ఎంపిక మీద క్లిక్ చేయండి.
3. తరువాత వినియోగదారులు వన్‌ప్లస్ నార్డ్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి INR499 డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది.
4. ప్రీ-ఆర్డర్ పూర్తి అయిన తరువాత వినియోగదారులు వన్‌ప్లస్ నుండి పరిమిత-ఎడిషన్ కలిగి ఉన్న బహుమతి బాక్స్ ను అందుకుంటారు.
5. అలాగే ఆగస్టు 31 లోగా వన్‌ప్లస్ నార్డ్‌ను ముందస్తు ఆర్డర్ చేసిన వినియోగదారులకు రెండవ బహుమతి బాక్స్ ను పొందడానికి అర్హత ఉంటుంది.
మరిన్ని వివరాలకు oneplus ఫోరమ్ లింక్ ను క్లిక్ చేయండి
వన్‌ప్లస్ సంస్థ ఇండియాలో ప్రారంభమైనప్పటి నుండి మొబైల్ ఆవిష్కరణలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. సరసమైన ధరల వద్ద ప్రీమియం నాణ్యత గల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేయడంలో పేరుగాంచిన వన్‌ప్లస్ పరిశ్రమ తన నిబంధనలను సవాలు చేస్తూ వన్‌ప్లస్ నార్డ్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి VR ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క అధికారిక లాంచ్ ఈవెంట్ ఇండియాలో జూలై 21, 2020, రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తోంది. వినియోగదారులు తమ ఇంటివద్దనే ఉండి చూడడానికి వీలుగా తన 'వర్చువల్' విడుదలను హోస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. "నెవర్ సెటిల్" యొక్క బ్రాండ్ మంత్రాన్ని అనుసరించి వన్‌ప్లస్ సంస్థ తన వినియోగదారుల కోసం సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క సరిహద్దులను సవాలు చేయడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications