Home
Apps

కొత్త హంగులతో భీమ్ యాప్

ఈ యాప్ పై అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో వాటన్నింటిని పరిష్కరించి సరికొత్త అప్‌డేట్‌తో వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు.

By Hazarath

సులభతరమైన నగదురహిత లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన భీమ్ యాప్ ఇప్పుడు కొత్త హంగులతో ముందుకు రానుంది. ఈ యాప్ పై అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో వాటన్నింటిని పరిష్కరించి సరికొత్త అప్‌డేట్‌తో వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఇది అన్ని యాప్‌లను తలదన్ని అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

లీకో నుంచి 64జిబి ఫోన్, జియో సిమ్ ఫ్రీ హోమ్ డెలివరీ

త్వరలో అప్‌డేట్

త్వరలో అప్‌డేట్

భీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) మొబైల్ యాప్‌నకు త్వరలో అప్‌డేట్ రానుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సరిచేసి సరికొత్త అప్‌డేట్ ఇవ్వనున్నారు.

30 లక్షల మందికి పైగా డౌన్లోడ్

30 లక్షల మందికి పైగా డౌన్లోడ్

ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే 30 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకొన్నారు. గూగుల్ ప్లేస్టోర్లో అగ్రస్థాయికి చేరడమే కాకుండా రిలయన్స్ మై జియో, వాట్సప్‌లను వెనక్కి నెట్టేసింది.

వినియోగదారులు ఎన్సీపీఐకి ఫిర్యాదు

వినియోగదారులు ఎన్సీపీఐకి ఫిర్యాదు

భీమ్ యాప్ నిర్వహణ సులభంగానే ఉన్నా కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నట్లు వినియోగదారులు అంటున్నారు. మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం, నగదు బదిలీ చేయడం, చేసిన తర్వాత డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో చేరిందో లేదో తెలియకపోవడం, కొన్ని లావాదేవీలు వాటికవే విఫలమవ్వడం వంటి ఇబ్బందులు ఉన్నట్లు వినియోగదారులు ఎన్సీపీఐకి ఫిర్యాదు చేశారు.

త్వరలోనే కొత్తవెర్షన్

త్వరలోనే కొత్తవెర్షన్

వీటన్నిటినీ సరిచేసి త్వరలోనే కొత్తవెర్షన్ విడుదల చేస్తామని ఆ సంస్థ ఎండీ, సీఈవో ఏపీ హోతా తెలిపారు. భీమ్ యాప్ ద్వారా జనవరి 2 నే రూ .3.7 కోట్ల విలువైన 45,000 లావాదేవీలు నమోదయ్యాయని వెల్లడించారు.

భీమ్ పేరుతో కొన్ని నకిలీ యాప్‌లు

భీమ్ పేరుతో కొన్ని నకిలీ యాప్‌లు

కాగా అంతర్జాలంలో భీమ్ పేరుతో కొన్ని నకిలీ యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌ల జోలికి వెళ్లకుండా ఎన్పీసీఐ అధికారంగా విడుదల చేసిన యాప్‌నే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ఎన్పీసీఐ కోరుతోంది.

భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం

భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
NPCI plans to update BHIM app read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X