ఆపిల్ ఐఫోన్ వారంటీ గురించి మీకు తెలియని విషయాలు


ఐఫోన్‌లను వాడుతున్నవారు మరియు కొత్త ఐఫోన్‌ను కొనాలని అనుకునేవారు గుర్తుపెట్టుకోవలసిన మరియు పరిగణించవలసిన విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే క్రొత్త ఐఫోన్‌ను కొనడానికి ఎంత మొత్తం ఖర్చు చేస్తారో కాదు మీరు దాన్ని కొనుగోలు చేసిన తర్వాత పొరపాటున అది పనిచేయకపోతే దానికి మరమత్తులు చేయించడానికి కూడా అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అందరు అనుకోవచ్చు ఐఫోన్ వారంటీ అందిస్తుంది.

Advertisement

ఐఫోన్‌ను మీరు కొనుగోలు చేసినప్పుడు మీకు ఒక సంవత్సరం వరకు పరిమిత వారంటీ లభిస్తుంది. ఆ తరువాత వారంటీని పొడిగించడానికి కొన్ని అదనపు బక్స్ ఇవ్వవచ్చు. ముందుగా ఐఫోన్ అందిస్తున్న వారంటీ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడం అందరికి చాలా అవసరం. ఆపిల్ యొక్క వెబ్‌సైట్ ఐఫోన్ వారంటీపై వర్తించే నిబంధనలు మరియు షరతులను కలిగిన వివరణాత్మక సమాచారం ఉంది. అవి ఏమిటో తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

Advertisement

--- ఒకవేళ మీరు వాడుతున్న ఐఫోన్‌ యొక్క బ్యాటరీ దెబ్బతిన్నట్లయితే అది ఆపిల్ యొక్క ఐఫోన్ వారంటీ పరిధిలో ఉండదు. వారంటీ పేజీలో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. "బ్యాటరీలు మరియు ఫోన్ ను కాపాడడానికి వినియోగించే భాగాలు కాలక్రమేణా వాటి నాణ్యత తగ్గే విధంగా రూపొందించబడింది కావున వీటిపై వారింటి వర్తించదు అని స్పష్టంగా పేర్కొంది."

--- అలాగే ఐఫోన్‌ యొక్క బ్యాక్ సైడ్ బాడీకి గీతలు, డెంట్లు పడి నష్టం కలిగిన దానికి వారంటీ వర్తించదని స్పష్టంగా చెప్పబడింది.

--- ఆపిల్ ఉత్పత్తి యొక్క ప్రత్యేకతలకు అనుగుణంగా లేని మూడవ పార్టీ ఉత్పత్తితో ఏదైనా నష్టం సంభవిస్తే కనుక అటువంటి దానికి వారంటీ వర్తించదు అని ఆపిల్ స్పష్టం చేసింది.

 

డౌన్‌లోడ్‌లలో ప్రభంజనం సృష్టిస్తున్న కాల్ ఆఫ్ డ్యూటీ-మొబైల్ గేమ్

 

--- మీరు ఐఫోన్‌ను వాడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు అది నీటిలో పడితే కనుక ఇది సాధారణ ప్రమాదంగా గుర్తించి దీనిని పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అన్ని ఐఫోన్‌లు వాటర్ ప్రూఫ్ తో వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఐఫోన్ కాలిపోయినా లేదా పాడైపోయినా అటువంటప్పుడు వారంటీ వర్తించదు.

 

200GB డాటా ప్రయోజనంతో BSNL Rs.698 ప్రీపెయిడ్ STV ప్లాన్

--- ఐఫోన్‌ ఒక వేల పాడైతే కనుక చాలా మంది చేసే మొదటి పని దానిని వెంటనే మరమ్మత్తు చేయించడానికి దగ్గరలో వున్న మరమ్మతు దుకాణానికి తీసుకువెళ్లుతారు. మరమ్మతు దుకాణంలో ఏదైనా నష్టం జరిగితే ఐఫోన్ యొక్క వారంటీ వర్తించదు. ఆపిల్ యొక్క ప్రతినిధి లేదా ఆపిల్ అధీకృత సర్వీస్ ప్రదాత (" AASP ") లేని ఎవరైనా చేసే మరమ్మత్తుల వల్ల కలిగే నష్టానికి ఆపిల్ ఎటువంటి బాధ్యత వహించదు అని స్పష్టంగా పేర్కొంది.

 

యాడ్-ఆన్ ప్యాక్‌లపై ధర తగ్గింపును ప్రకటించిన టాటా స్కై

--- ఆపిల్ యొక్క అన్ని ఐఫోన్‌లకు ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు చేసిన ఏదైన పొరపాటు వలన సీరియల్ నంబర్ ఆపిల్ ప్రొడక్ట్ నుండి తొలగించబడిన లేదా డీఫ్యాక్ చేయబడిన అప్పుడు అది ఐఫోన్ వారంటీ ద్వారా కవర్ చేయబడదు.

2GB వరకు డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు

--- ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఐఫోన్ మీదే అని మొదటిగా నిరూపించుకోవాలి. ఐఫోన్‌ను కొన్నప్పుడు మీరు సమర్పించిన ఐడి మాత్రమే మరమ్మత్తు సమయంలో ఉపయోగపడుతుంది. ఒక వేల ఐఫోన్‌ను దొంగిలించబడింది అని ఆపిల్ సంబంధిత ప్రజా అధికారుల నుండి సమాచారాన్ని స్వీకరిస్తే కనుక అప్పుడు వారంటీ చాలా స్పష్టంగా వర్తించదు.

Best Mobiles in India

English Summary

Apple iPhone Warranty: Facts Check