RS.2000 తగ్గింపుతో అమెజాన్ లో ఒప్పో రెనో 2F & 2Z సేల్


ఒప్పో సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలో ఎంత ప్రజాదరణ పొందాయో అందరికి తెలుసు. ఒప్పో సంస్థ అన్ని రకాల ధరలలో వారి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూఉంటాయి. ఒప్పో ఆగష్టు నెలలో విడుదల చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు రెనో 2F మరియు రెనో 2Zలపై ఇప్పుడు ధర తగ్గింపును ప్రకటించింది.

Advertisement

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలో విడుదలై రెండు నెలలు కాకముందే వీటి మీద ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ఒకొక్క హ్యాండ్‌సెట్‌పై 2,000 రూపాయల తగ్గింపును ప్రకటించింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయినప్పుడు ఎంత ధరతో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎంత తగ్గింపును పొందాయి మరియు ఇవి తగ్గింపు ధరతో ఎక్కడ లబిస్తాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

RS.1000ల ధర తగ్గిన ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌

Advertisement
తగ్గింపు ధరల వివరాలు

OPPO రెనో 2F ఇండియాలో మొదట రూ.25,990ల ధర వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు ఇది రూ.23,990 ధర వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు OPPO రెనో 2Z కూడా రూ.29,990 వద్ద మొదటిసారి ఇండియాలో విడుదల అయింది. ఇప్పుడు ఇది రూ.27,990 వద్ద లభిస్తుంది.

 

Rs.1,500 ధర తగ్గింపుతో వివో ఫోన్లు!!! ఓ లుక్ వేయండి....

లభ్యత

కొత్త ధర ట్యాగ్‌తో ఉన్న ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్రిక్ & మోర్టార్ స్టోర్లలో మరియు అమెజాన్ ద్వారా ఈ రోజు నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. OPPO రెనో 2F స్కై వైట్ మరియు లేక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే స్కై వైట్, లూమినస్ బ్లాక్ మరియు పోలార్ లైట్ కలర్ లలో రెనో 2 జెడ్ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది.

 

అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌

OPPO రెనో 2F స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ నానో పోర్ట్స్ గల ఒప్పో రెనో 2F ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఇది 6.55-అంగుళాల ఫుల్-HD + (1,080 x 2,400 పిక్సెల్స్) డైనమిక్ AMOLED డిస్‌ప్లేను 93.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటుంది మరియు ఇది గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ మరియు డిస్ప్లే లోపల ఫింగర్ ప్రిన్స్ స్కానర్ సెన్సార్ తో వస్తుంది. వెనుకవైపు కూడా స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని కలిగి ఉంది. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

కెమెరా సెటప్‌

ఒప్పో రెనో 2F స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇందులో ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పో రెనో 2 యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సహాయంతో 2x ఆప్టికల్ జూమ్, 5x హైబ్రిడ్ జూమ్ మరియు 20x డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో షార్క్-ఫిన్ స్టైల్ ఎలివేటింగ్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

 

25 వేల లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

బ్యాటరీ

ఒప్పో రెనో 2 సున్నితమైన యూజర్ అనుభవాన్ని అందించడానికి హైపర్ బూస్ట్ 2.0, ఫ్రేమ్ బూస్ట్ మరియు టచ్ బూస్ట్ టెక్నాలజీలతో ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్‌కు మద్దతు ఇచ్చే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

ఇండియాలో లాంచ్ అవుతున్న ఒప్పో రెనో2 సిరీస్:ధర,స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 2Z స్పెసిఫికేషన్స్

రెనో 2Z గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080 x 2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఈ రెండు ఫోన్‌లలో షార్క్ ఫిన్-స్టైల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఇది ఫోన్ ఎగువ మధ్య అంచున 16 మెగాపిక్సెల్ లెన్స్‌తో స్టాండర్డ్ పాప్-అప్ కెమెరాను అందిస్తుంది.

ఫీచర్స్

హ్యాండ్‌సెట్ యొక్క లోపలి భాగంలో మీడియాటెక్ హెలియో P 90 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. దీనితో పాటు ఇది 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే కెమెరా విభాగానికి వస్తే రెనో 2Z యొక్క వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో మొదటి కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ తో మరియు మూడవ,నాల్గవ కెమెరాలు 2 మెగాపిక్సెల్ మోనో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ తో వస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6 తో రన్ అవుతుంది. ఇది VOOC 3.0 ఛార్జింగ్‌కు మద్దతుతో ఉన్న 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో రెనో 2Z మరియు అన్ని రెనో 2 సిరీస్ ఫోన్‌లలో ఫీచర్స్ ఒకే విధంగా ఉంటుంది.

Best Mobiles in India

English Summary

OPPO Reno 2F and Reno 2Z Receive Rs.2,000 price Cut in India