అమెజాన్ లో గొప్ప ఆఫర్లతో మొదటిసారి ఒప్పో A 9 2020 అమ్మకాలు

|

ఒప్పో A 9 2020 ఈ రోజు నుంచి ఇండియాలో అమ్మకానికి సిద్ధమవుతున్నది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా కొనుగోలుదారులు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ప్రముఖ ఈ- కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ ప్రారంభం కానున్నాయి.

ఒప్పో A 9 2020
 

ఒప్పో A 9 2020 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌ ద్వారా అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడని వారు ఒప్పో యొక్క ఆఫ్‌లైన్ సేల్స్ ఛానల్స్ ద్వారా సెప్టెంబర్ 19 నుండి పొందవచ్చు. ఒప్పో A9 2020 స్నాప్‌డ్రాగన్ 665 SoC, 5,000mh బ్యాటరీ మరియు క్వాడ్-కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 ధరల వివరాలు

ధరల వివరాలు

ఒప్పో A 9 2020 ఇండియాలో కేవలం రెండు వేరియంట్‌లతో అమ్మకానికి సిద్ధమైంది. ఈ వేరియంట్ లలో 4 జీబీ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క వేరియంట్‌ ధర 16,990 రూపాయలు. అలాగే ఫోన్ యొక్క మరొక వేరియంట్ 8 జీబీ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 19,990 రూపాయలు. అమెజాన్‌లో ఒప్పో A 9 2020 యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మెరైన్ గ్రీన్ మరియు స్పేస్ పర్పుల్ కలర్ వేరియంట్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఆఫర్స్

ఆఫర్స్

ఒప్పో A 9 2020 ఇండియాలో కొనుగోలు చేయడానికి కొన్ని లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే ఒప్పో సంస్థ కొనుగోలుదారులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో చెల్లించడంపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఒప్పో సంస్థ అందిస్తున్న ఆఫర్లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ నానో సిమ్ కార్డులను మరియు ఒక SD కార్డ్ స్లాట్ గల ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్ OS 6.0.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ మరియు గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 5,000mAh బ్యాటరీతో జతచేయబడిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని పొందుతుంది.

కెమెరాలు

కెమెరాలు

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇది ప్రస్తుతం అందరికి తెలిసిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో నిలువుగా అమర్చబడి ఉంటాయి. ఇందులో మొదటిది ప్రైమరీ కెమెరా 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు శామ్‌సంగ్ GM1 లెన్స్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రా-వైడ్ (119 డిగ్రీ) లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. దీని యొక్క వెనుక కెమెరాను "అల్ట్రా నైట్ మోడ్ 2.0" తో అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్‌కు AI మెటీఫికేషన్ మోడ్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా షూటర్ లభిస్తుంది.

కెమెరా ఫీచర్స్

కెమెరా ఫీచర్స్

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అల్ట్రా నైట్ మోడ్ 2.0 మోడ్‌తో వస్తుంది. ఇది తక్కువ కాంతి ఉన్నపుడు మరియు వాతావరణ పరిస్థితి అననుకూలంగా కూడా లేనప్పుడు వివరణాత్మక ఫోటోలను తీయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రీమియం రెనో 2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా లభిస్తుంది. ఇమేజింగ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి స్మార్ట్‌ఫోన్‌ EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ మరియు టచ్ టు ఫోకస్ ఫీచర్‌తో వస్తుంది.

అంతేకాకుండా ఫ్లాగ్‌షిప్ పరికరాల్లో ఇంతకు ముందు అందుబాటులో ఉన్న విభిన్న కెమెరా మోడ్‌లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పుడు ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో క్లిస్టమైన షాట్‌లను కూడా షూట్ చేయవచ్చు. స్లో-మోషన్ వీడియోలను కూడా సంగ్రహించవచ్చు. అంతేకాక మీరు వెనుక కెమెరాను ఉపయోగించి 1080p స్లో-మోషన్ వీడియోలను మరియు 30fps వద్ద 4K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. AI- సీన్ డిటెక్షన్ మద్దతుతో పరిసరాలను విశ్లేషించడం ద్వారా ఫోటో యొక్క నాణ్యతను మెరుగుపరచవచ్చు.

బ్యాటరీ

బ్యాటరీ

ఒప్పో అందిస్తున్న ఈ హ్యాండ్‌సెట్‌ యొక్క ముఖ్యమైన అంశాలలో బ్యాటరీ ఒకటి. బడ్జెట్‌తో పాటు మిడ్-రేంజ్ విభాగంలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఒప్పో దీని కంటే పెద్ద బ్యాటరీ యూనిట్‌ను అందిస్తోంది. ఒప్పో A9 2020 హ్యాండ్‌సెట్‌ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక్క ఛార్జీతో 20 గంటలకు పైగా బ్యాకప్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి రోజు మీరు మీతో పాటు ఛార్జర్‌ను తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక రోజు మొత్తం రన్ చేయడానికి కావలసిన ఛార్జింగ్ మీకు ఒప్పో బ్యాటరీ ఇస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo A9 2020 Sales Start Today in India via Amazon: Price,Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X