BSNL New Prepaid Plan: 600 రోజుల వాలిడిటీతో గల ఏకైక లాంగ్ -టర్మ్ ప్లాన్


ప్రభుత్వ ఆద్వర్యంలో గల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన అన్ని రకాల వినియోగదారుల కోసం వివిధ రకాల ప్లాన్లను లాంచ్ చేస్తున్నది. ప్రస్తుతం ఎక్కువ మంది అధిక డేటాను వాడుతున్నారు అని అనుకోవడం చాలా పొరపాటు.

Advertisement

బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

అధిక డేటాను వినియోగించే వారు అధికంగా ఉన్నపటికీ తక్కువ మొత్తంలో డేటాను వాడుతూ అధికంగా ఫోన్ కాల్స్ చేసే వారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బిఎస్ఎన్ఎల్ అటువంటి వారి కోసం ఏకంగా 600 రోజుల చెల్లుబాటు కాలంతో కొత్త ప్లాన్ ను విడుదల చేసింది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లు ఈ కొత్త ప్లాన్ డేటాను వాడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Rs.10,000 ధర లోపు ఆన్‌లైన్ సేల్స్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

Advertisement
బిఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ ప్రయోజనం

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ కొత్త ప్లాన్ రూ.2,399 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ అనుభవాన్ని ఇవ్వడంపై అధిక దృష్టి పెట్టింది. ఇది రీఛార్జ్ చేసిన రోజు నుండి 600 రోజుల చెల్లుబాటుతో ఇది లభిస్తుంది. టెలికామ్ మార్కెట్లో ఇతర ప్లాన్లు ఏవీ ఈ రకమైన యాక్సిస్ తో ఇన్ని రోజుల వాలిడితో రావడం లేదు. కానీ ఈ ప్లాన్ యొక్క ఏకైక లోపం ఏమిటంటే డేటా ప్రయోజనం ఏదీ లేకపోవడం.

Realme TV: అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ....

 

దీర్ఘకాలిక వాయిస్ కాలింగ్

ఈ ప్లాన్ మీకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS మరియు 60 రోజుల పాటు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి కాని డేటా ప్రయోజనం మాత్రం ఏదీ లేదు. కాబట్టి మీరు టెల్కో నుండి విడిగా డేటా ప్యాక్ కొనవలసి ఉంటుంది. డేటాను ఎక్కువగా ఉపయోగించని మరియు దీర్ఘకాలిక వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని మాత్రమే కోరుకునే వినియోగదారులకు ఇది మంచిది. ఏదేమైనా ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు అధికంగా 600 రోజులపాటు ఉండడం మరి గొప్ప విషయం. BSNL యొక్క రూ.2,399 ప్లాన్ అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో లాంగ్ -టర్మ్ ప్లాన్

రిలయన్స్ జియో 2,399 రూపాయలకు లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. జియో నుండి ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కానీ బిఎస్‌ఎన్‌ఎల్ నుండి వచ్చిన ప్లాన్‌తో పోల్చినప్పుడు అదే ధర వద్ద ఇప్పటికీ తక్కువ వాలిడిటీని కలిగి ఉంది. ఇందులో జియో-జియోకు అపరిమిత కాలింగ్‌కు పరిమితులు లేవు కాని మరొకరికి ఐయుసి పరిమితి ఉంది. ఏదేమైనా రిలయన్స్ జియో నుండి వచ్చిన ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది. ఇది డేటా ప్రయోజనాలతో లాంగ్-టర్మ్ ప్లాన్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది మరింత ఆసక్తికరంగా చేస్తుంది. దీనితో పాటు వినియోగదారులు అన్ని Jio అనువర్తనాలకు రోజుకు 100 SMS మరియు కాంప్లిమెంటరీ చందా యొక్క ప్రయోజనాన్ని పొందుతారు.

ఎయిర్‌టెల్ లాంగ్-టర్మ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు లాంగ్-టర్మ్ ప్లాన్ కింద రెండు ధరల వద్ద రెండు ప్లాన్ లను అందిస్తున్నాయి. రూ.2,398 ధర వద్ద ఒక సంవత్సరం 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా 1.5GB రోజువారీ డేటా ప్రయోజనంను అందించింది. అలాగే రూ.2498 ధర వద్ద 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో అదే 365రోజుల వాలిడిటీతో మరొక ప్లాన్ ను అందిస్తున్నది. ఈ రెండు ప్లాన్ లు ZEE5 ప్రీమియం, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మరియు వింక్ మ్యూజిక్‌ల యాప్ లకు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ లాంగ్ - టర్మ్ ప్లాన్

వోడాఫోన్ సంస్థ రూ.2,399 ధర వద్ద లాంగ్ -టర్మ్ ప్లాన్ ను అందిస్తున్నది. ఈ ప్లాన్ తన వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. ఇవే కాకుండా ప్రత్యేక ప్రయోజనాలలో 499 రూపాయల విలువైన వోడాఫోన్ ప్లే మరియు రూ.999 విలువైన ZEE5 ప్రీమియానికి కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన రోజు నుండి 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

లాంగ్ టర్మ్ ప్లాన్ ల మధ్య పోలికలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ ఈ ధర వద్ద ఇతర టెల్కోలు అందిస్తున్న దానికి వ్యతిరేకంగా చాలా ఎక్కువ కాలం వాలిడిటీతో తన లాంగ్ -టర్మ్ ప్లాన్ ను అందిస్తున్నది. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లో మాత్రం డేటా ప్రయోజనాలు ఏవీ లేవు. కాబట్టి డేటా ప్రయోజనాలను కోరుకునే వ్యక్తులు డేటాను పొందడానికి మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది 600 రోజుల చెల్లుబాటుతో రావడం చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

జియో,ఎయిర్‌టెల్,వొడాఫోన్ Vs బిఎస్‌ఎన్‌ఎల్

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ నుండి వచ్చిన ప్లాన్లతో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్లాన్ ను పోల్చినప్పుడు అవి తక్కువ వాలిడిటీతో లభించినప్పటికీ వాటికి ఒక సంవత్సరం చెల్లుబాటుతో పాటు డేటా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజువారీ డేటా ప్రయోజనాల ఆధారంగా రిలయన్స్ జియో అందరికంటే ముందుంటుంది. కాని ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఎటువంటి ఐయుసి పరిమితులు లేకుండా అపరిమిత కాలింగ్ సదుపాయంతో జియో కంటే ముందు ఉన్నాయి.

Best Mobiles in India

English Summary

BSNL Launched Rs 2399 New Prepaid Plan: Unlimited Calls and 600 Days Validity