Home
News

BSNL Combo 18 Plan: అధిక డేటా వినియోగదారులకు సరైన ప్లాన్...

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తమిళనాడు సర్కిల్‌లోని తన చందాదారుల కోసం కొత్తగా రెండు రోజుల చెల్లుబాటుతో కాంబో 18 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న సరసమైన ప్లాన్‌లలో ఒకటైన కాంబో 18 ప్లాన్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్ మరియు పుదుచ్చేరితో సహా మరో 22 సర్కిళ్లలో కూడా అందుబాటులో ఉంది.

బిఎస్ఎన్ఎల్ కాంబో ప్లాన్

బిఎస్ఎన్ఎల్ కాంబో ప్లాన్

అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు అస్సాం, మణిపూర్, నాగాలాండ్ వంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ ఈ ప్రణాళికను అందించదు. కాంబో 18 ప్లాన్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ నంబర్లతో పాటు బిఎస్ఎన్ఎల్ కాని నంబర్లకు ఉచిత కాల్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ ధరను కలిగి ఉండి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నందున ప్రస్తుతం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. BSNL యూజర్లకు బ్యాడ్ న్యూస్!!! వాయిస్ కాల్స్,SMS లపై "రేషనలైజేషన్" పరిమితి...

బిఎస్‌ఎన్‌ఎల్ కాంబో 18 ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ కాంబో 18 ప్లాన్ ప్రయోజనాలు

BSNL కాంబో 18 ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 1.8GB వరకు హైస్పీడ్ డేటాను బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. BSNL పరిమితిని చేరుకున్న తర్వాత దీని యొక్క వేగం 80 Kbpsకు తగ్గించబడుతుంది. అదనంగా కాంబో 18 ప్లాన్ వినియోగదారులకు భారతదేశం అంతటా బిఎస్ఎన్ఎల్ మరియు బిఎస్ఎన్ఎల్ కాని నంబర్లకు 250 నిమిషాల పాటు కాల్స్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. BSNL నుంచి వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్... 4G అప్‌గ్రేడ్ ఫ్రీగా....

కాంబో 18 ప్లాన్ లభించే సర్కిల్‌లు

కాంబో 18 ప్లాన్ లభించే సర్కిల్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ కాంబో 18 ప్లాన్ ప్రస్తుతం ఛత్తీస్‌గడ్, చండీగడ్ , చెన్నై, డామన్ మరియు డయు, దాద్రానగర్ హవేలి, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, లడఖ్ మరియు లక్షద్వీప్ సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా వీటితో పాటుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పుదుచ్చేరి, రాజస్థాన్, యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు ఉత్తరాఖండ్ లోని వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ ఎనేబుల్ చేసింది.  BSNL Discount Offer: ఇతర BSNL నెంబర్ రీఛార్జిలపై గొప్ప తగ్గింపు ఆఫర్...

ఇరోస్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ 98 డేటా వోచర్‌

ఇరోస్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ 98 డేటా వోచర్‌

బిఎస్ఎన్ఎల్ తమిళనాడు సర్కిల్ వినియోగదారులు 22 రోజుల వాలిడిటీ కాలంలో అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి వీలు కల్పించిన రూ.98 డేటా వోచర్ హైలైట్ గా ఉంది. గతంలో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఈ రూ.98 ప్లాన్‌ 24 రోజుల వాలిడిటీ కాలానికి లభించేది. ప్రస్తుతం ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 2GB వరకు హై స్పీడ్ డేటాను మరియు దాని తరువాత 40 కెబిపిఎస్ తో డేటాను బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు అవకాశం ఇచ్చింది. "డేటా సునామి" గా పిలువబడే ఈ ప్యాక్ వినియోగదారులకు ఈరోస్ నౌ వినోద సేవలకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. BSNL అందిస్తున్న అధిక డేటా ప్రీపెయిడ్ డేటా STVs వోచర్‌లు

బిఎస్ఎన్ఎల్ క్యాష్‌బ్యాక్

బిఎస్ఎన్ఎల్ క్యాష్‌బ్యాక్

బిఎస్ఎన్ఎల్ తమిళ సర్కిల్ ప్రాంతంలో ఇటీవల 6పైస క్యాష్‌బ్యాక్ పథకాన్ని మే 31 వరకు పొడిగించిందని కూడా గమనించాలి. క్యాష్‌బ్యాక్ పథకం దాని వినియోగదారులకు 5 నిమిషాల వాయిస్ కాల్‌లపై 6 పైసల క్యాష్‌బ్యాక్ సంపాదించడానికి వీలు కల్పిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Combo 18 Plan offers 1.8GB Daily Data, 250 min Free Calls only Selected Circles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X