facebook ప్రొఫైల్ లాక్ ఫీచర్ గురించి ముఖ్యమైన విషయాలు


ఫేస్‌బుక్‌ యొక్క వాడకం ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఏదైనా సమాచారంను అందరికి తెలిసేలా పోస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఎంచుకొనే మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఫేస్‌బుక్‌. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లు ఉన్నపటికీ ఇప్పుడు కొత్తగా ఫేస్‌బుక్ "లాక్ ప్రొఫైల్" అనే ఫీచర్‌ను ప్రకటించింది.

Advertisement

ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్

వినియోగదారుల యొక్క 'స్నేహితుల' జాబితాలో లేని ఎవరైనా తమ ప్లాట్‌ఫారమ్‌లోని పూర్తి సంచారాన్ని చూడకుండా రక్షించుకోవడానికి ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. ఫేస్‌బుక్‌లో తమ సమాచారంపై మరింత నియంత్రణను కోరుకునే ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ కొత్త "లాక్ ప్రొఫైల్" ఫీచర్ సహాయంతో తమ యొక్క సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచుకోవచ్చు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రొఫైల్ పిక్చర్ గార్డ్ యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న ఈ తాజా "ప్రొఫైల్ సెక్యూరిటీ ఫీచర్" గురించి మరిన్ని ఆశక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.  Realme Smart TV ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి....

Advertisement
ఫేస్‌బుక్‌ "ప్రొఫైల్ లాక్ ఫీచర్" అసలు ఏమి చేస్తుంది?

"లాక్ ప్రొఫైల్ ఫీచర్" సహాయంతో తమ ప్లాట్‌ఫామ్‌లోని ప్రొఫైల్‌లకు అదనపు భద్రతా పొరను జోడిస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ ఫీచర్ ను ప్రారంభించిన వారి యొక్క పూర్తి-పరిమాణ ప్రొఫైల్ ఫోటోను మరియు కవర్ ఫోటోను తమ జాబితాలో స్నేహితులు కానివారు జూమ్ చేయలేరు, భాగస్వామ్యం చేయలేరు లేదా డౌన్‌లోడ్ చేయలేరు. అదేవిధంగా మీ యొక్క పాత మరియు క్రొత్త పోస్ట్‌లను స్నేహితులు కానివారు చూడలేరు కూడా. Jio, Airtel, Vodafone: లాక్డౌన్ లో మీకు ఉపయోగపడే అధిక డేటా ప్లాన్‌లు

ఫేస్‌బుక్ గోప్యత

ఫేస్‌బుక్ ఇప్పటికే ఇలాంటి భద్రతా మెరుగుదలలను అందించే అనేక గోప్యతా ఎంపికలను అందిస్తున్నప్పటికీ ఈ క్రొత్త ఫీచర్ తప్పనిసరిగా మరిన్ని విషయాలను చాలా సులభం చేస్తుంది. ప్రత్యేకించి ఈ ప్లాట్‌ఫారమ్‌లో గోప్యతా ఎంపికలను నావిగేట్ చేయడం కష్టమనిపించే వ్యక్తులకు ఇది సరిగ్గా ఉపయోగపడుతుంది. COVID19 సమయంలో మీకు సహాయపడే ప్రభుత్వ యాప్ లు ఇవే...

ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్

"ప్రజలు తమను తాము వ్యక్తీకరించడానికి సురక్షితమైన వేదికను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఫేస్బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియాలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ ఆన్‌లైన్ ప్రొఫైల్‌ను రక్షించుకోవడంలో ఉన్న ఆందోళనలలో ఈ క్రొత్త ఫీచర్‌ వారికి సహాయపడుతుంది. ఇది ఒక సులభమైన దశలో ఎక్కువ నియంత్రణను ఇస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో ప్రజల యొక్క గోప్యతను మరింత సురక్షితంగా ఉంచుతుంది.

ప్రొఫైల్ లాక్ ఫీచర్ గుర్తు

ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ క్రొత్త ఫీచర్‌ను ప్రారంభించిన తర్వాత తమ యొక్క పాత పబ్లిక్ పోస్ట్‌లన్నీటిని కేవలం తమ యొక్క స్నేహితులు మాత్రమే చూడగలరని కూడా గమనించాలి. భద్రతా ఫీచర్ ఉంటే స్నేహితులు కానివారు మెసెంజర్ ద్వారా మెసేజ్ లను పంపగలరా లేదా అనే దాని మీద ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ప్రొఫైల్ లాక్ చేయబడిందని గుర్తు చేయడానికి ప్రొఫైల్ పేజీకి బ్లూ బ్యాడ్జ్ జోడించబడుతుందని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫేస్‌బుక్ లాక్ ప్రొఫైల్ ఎంపికను కనుగొనడం?

ఫేస్‌బుక్ యొక్క ఈ కొత్త ఫీచర్ నెమ్మదిగా ఇండియాలోని వినియోగదారులకు దశల వారిగా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ను కనుగొనడానికి మీ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్ యొక్క పేరులో "మోర్" ఆప్షన్ నొక్కడం ద్వారా దాని లభ్యతను తనిఖీ చేయవచ్చు. మీరు లాక్ ప్రొఫైల్ ఎంపికను గుర్తించినట్లయితే అది మీ కోసం అందుబాటులో ఉంటుంది. లాక్ ప్రొఫైల్ ఎంచుకోని దానిని నిర్ధారించడం ద్వారా మీ ప్రొఫైల్‌ను లాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English Summary

Facebook Launches New Feature Called Lock Profile