Realme Smart TV ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి....
రియల్‌మి సంస్థ ఇండియాలో తన స్మార్ట్ ఫోన్లతో మంచి విజయం సాధించిన తరువాత ఇప్పుడు మొదటి సారిగా టెలివిజన్ విభాగంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేస్తోంది. ఈ నెల మే 25 న రియల్‌మి సంస్థ తన ఎనిమిది రకాల ప్రొడెక్టులను విడుదల చేయాలని భావించింది.

రియల్‌మి స్మార్ట్ టివి
అందులో ఒకటైన స్మార్ట్ టివి ప్రముఖ మీడియాటెక్ ప్రాసెసర్ చిప్ సెట్ ద్వారా రన్ అవుతున్నట్లు రియల్‌మి తెలిపింది. అలాగే ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో కొత్త స్మార్ట్ టీవీ రన్ అవుతున్నట్లు కంపెనీ తన ట్విట్టర్‌తో సహా అధికారిక ఛానెళ్లలో టీజ్ చేసింది. ఏప్రిల్ నెలలో రియల్‌మి టీవీకి గూగుల్ సర్టిఫికేషన్ లభించినట్లు మరియు దీనితో టీవీ యొక్క అనేక మోడళ్లను కంపెనీ తయారుచేయనున్నట్లు కూడా సంస్థ ఇప్పటికే తెలిపింది. రియల్‌మి నుంచి వస్తున్న కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి టీవీ డిజైన్
రియల్‌మి యొక్క కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉండడంతో పాటుగా అధిక వాటేజ్ స్పీకర్లను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. రియల్‌మి టీవీ యొక్క డిస్ప్లే విభాగంలో సగటు టీవీల కంటే 20% ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది 400 నిట్స్ వరకు "అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే" ను కలిగి ఉంటుంది. 64-బిట్ మీడియాటెక్ ప్రాసెసర్ మాలి -470 జిపియుతో పాటు సిస్టమ్‌తో "ఫస్ట్ ఇన్-సెగ్మెంట్" ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 24W స్టీరియో ఫోర్ స్పీకర్లను కలిగి ఉన్నట్లు రియల్‌మి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రియల్‌మి టీవీ మోడల్స్
రియల్‌మి టీవీ 2020 రెండవ త్రైమాసికంలో భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ పలు సందర్భాల్లో ధృవీకరించారు. ఈ రియల్‌మి బ్రాండెడ్ ఆండ్రాయిడ్ టీవీ సిరీస్ 55-అంగుళాల డిస్ప్లే ప్యానెల్ వరకు వివిధ పరిమాణాల్లో అందిస్తుందని భావిస్తున్నారు.
From being one of the top smartphone brands, here's our leap to become the most loved tech-lifestyle brand.
— realme (@realmemobiles) May 18, 2020
With #RealPicture #RealSound, enter the world of imagination as we bring to you #realmeSmartTV. https://t.co/1IPaAO1DsM
టీజర్
చైనా సంస్థ గత సంవత్సరం నుండి ఈ సమాచారాన్ని టీజ్ చేస్తోంది. ఇటీవల రియల్‌మి టీవీ పేరిట 43 అంగుళాల ఎల్‌ఈడీ ప్యానల్‌తో BIS జాబితాను గుర్తించారు. దీనితో పాటుగా ఇప్పుడు బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ సైట్‌లో మరో రెండు రియల్‌మి ఎల్‌ఈడీ టీవీ మోడళ్లను కూడా గుర్తించారు. 43 అంగుళాల మరియు 32-అంగుళాల మోడల్స్ డిస్ప్లే పరిమాణాలలో టీవీలను కంపెనీ విడుదల చేయవచ్చని లిస్టింగ్ వెల్లడించింది.

రియల్‌మి టీవీ బ్లైండ్ ఆర్డర్
రియల్‌మి యొక్క కొత్త ప్రోడక్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ముందుగానే కొనడానికి అర్హత సాధించడానికి 2000 రూపాయలు ముందుగానే చెల్లించమని కంపెనీ వినియోగదారులను ఆహ్వానించడం కోసం రియల్‌మి తన వెబ్‌సైట్‌లో "బ్లైండ్ ఆర్డర్" ను సిద్ధం చేసింది. "బ్లైండ్ ఆర్డర్" లో భాగంగా కొనుగోలుదారులు ముందుగా రెండు వేల రూపాయలు చెల్లించి రిజిస్టేషన్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని టీవీ విడుదల అయ్యాక బకాయిలను చెల్లించవచ్చని కంపెనీ తెలిపింది.

బ్లైండ్ ఆర్డర్
మే 18 నుండి మే 24 మధ్య రియల్‌మి టీవీ యొక్క "బ్లైండ్ ఆర్డర్" అమలులో ఉంటుంది అని సంస్థ తెలిపింది. టీవీని మే 25న విడుదల చేస్తుండగా మిగిలిన మొత్తాన్ని మే 25 నుండి మే 31 మధ్య చెల్లించవచ్చని రియల్‌మి తెలిపింది. రియల్‌మి టీవీ యొక్క డెలివరీలు మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. రియల్‌మి వెబ్‌సైట్‌లో బ్లైండ్ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.500 కూపన్లు ఉచితంగా లభిస్తాయి. ఇవి జూన్ 1 నుండి జూన్ 30 మధ్య చెల్లుతాయి.


Click it and Unblock the Notifications








