Redmi 10X series: షియోమి నుంచి 5G సపోర్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!!! ఫీచర్స్ అదుర్స్...


ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి ప్రస్తుతం మరొక కొత్త ‌ఫోన్‌లను విడుదల చేసింది. చాలా వాయిదాల తరువాత మొత్తానికి ఈ రోజు రెడ్‌మి 10X సిరీస్ ఎట్టకేలకు చైనాలో ప్రారంభించబడింది. ఈ బ్రాండ్ రెడ్‌మి 10X మరియు రెడ్‌మి 10X ప్రో అనే రెండు వేరియంట్ లను విడుదల చేసింది.

Advertisement

రెడ్‌మి 10X సిరీస్

7nm చిప్‌సెట్, 5G సపోర్ట్, AMOLED డిస్ప్లే, 4,520mAh బ్యాటరీ వంటి మరిన్ని టాప్ ఫీచర్లు మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు అధిక వాట్ ఛార్జర్‌లను కలిగి ఉన్న ఈ కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. BSNL New Prepaid Plan: 600 రోజుల వాలిడిటీతో గల ఏకైక లాంగ్ -టర్మ్ ప్లాన్

Advertisement
ధరల వివరాలు

రెడ్‌మి 10X 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో ‌విడుదల అయింది. ఇందులో బేస్ వేరియంట్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క ధర RMB 1,599 ఇండియా కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.16,960. 6GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర RMB 1,799 (సుమారు రూ .19,080). 8GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర RMB 2,099 (సుమారు రూ .22,260). చివరగా 8GB ర్యామ్+ 256 స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర RMB 2,399 (సుమారు రూ .2,5450) గా నిర్ణయించబడింది. అలాగే రెడ్‌మి 10X ప్రో మోడల్ యొక్క 8GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ RMB 2,399 (సుమారు రూ .25,450) ధర నుండి మొదలవుతుంది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర లేబుల్ RMB 2,599 (సుమారు రూ .27,570). Tata Sky Broadband లో ఈ కొత్త మార్పులు గమనించారా!!!

రెడ్‌మి 10X 5G ఇండియా లాంచ్

సరికొత్త షియోమి రెడ్‌మి ఫోన్‌ల యొక్క ప్రీ-సేల్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ జూన్ 1 న చైనాలో అధికారికంగా మార్కెట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ 5G రెడ్‌మి 10X ఫోన్‌లు భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో అన్న దాని మీద ఇంకా ఎటువంటి సమాచారంను సంస్థ విడుదల చేయలేదు. షియోమి యొక్క ఫోన్లు అధికంగా భారతదేశం మార్కెట్లలో అమ్ముడవుతున్న కారణంగా ఇండియాలో కూడా వీటిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆశించవచ్చు.

WhatsApp QR Code ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు...

రెడ్‌మి 10X సిరీస్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 10X ‌లో హెచ్‌డిఆర్ 10+ సపోర్ట్ మరియు ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.57-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో, 4,300,000: 1 కాంట్రాస్ట్ రేషియో, 800 నిట్స్ ప్రకాశం మరియు 98 శాతం NTSCను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది.

డిజైన్

రెడ్‌మి 10X సిరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్యానెల్ 180Hz టచ్ నమూనా మద్దతుతో వస్తుంది. అలాగే ఇది మందమైన నానో పూత కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫోన్ IP53 కి కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే ఇది దుమ్ము మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ద్వారా రక్షించబడుతుంది. ఈ బ్రాండ్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో స్టాండర్డ్ వెర్షన్ 22.5W ఛార్జర్‌తో మరియు ప్రో వెర్షన్ 33W ఛార్జర్‌ టెక్నాలజీను కలిగి ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 4,520 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉండి వివిధ రకాల స్టోరేజ్ ఎంపికలతో ప్యాక్ చేయబడి ఉన్నాయి.

ఫీచర్స్

రెడ్‌మి 10X సిరీస్ స్మార్ట్ ఫోన్లు 7nm ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతాయి. ఈ చిప్‌సెట్ మిడ్-రేంజ్ పరికరాల కోసం మరియు 5G మద్దతును చౌకైన ఫోన్‌లకు తీసుకురావడానికి ప్రారంభించబడింది. ఇది ఆసియా, ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని గ్లోబల్ సబ్ -6GHz 5G నెట్‌వర్క్‌ల కోసం రూపొందించబడింది. డైమెన్సిటీ 820 హైపర్ఇంజైన్ 2.0 విస్తరింపులతో పాటు Arm మాలి G57 GPU గ్రాఫిక్స్ తో ప్యాక్ చేస్తుంది. దీనిని చైనాలో మెడిటెక్ టియాంజి 820 అని పిలుస్తున్నారు. ఈ మీడియాటెక్ చిప్ పనితీరులో కిరిన్ 985 SoC ని అధిగమించిందని రెడ్‌మి జనరల్ మేనేజర్, లు వీబింగ్ పేర్కొన్నారు.

కెమెరా ఫీచర్స్

రెడ్‌మి 10X 5G సిరీస్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ 5G స్టాండ్‌బైకి మద్దతును ఇస్తుంది. ఇది లిక్యూడ్-కూల్ సిస్టంను కలిగి ఉండి వేడిని వెదజల్లే వ్యవస్థతో వస్తుంది. ఫోటోగ్రఫీ సెషన్ల విషయానికొస్తే 10X ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో 8 మెగాపిక్సెల్ 3X ఆప్టికల్ జూమ్, 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ వంటివి ఉన్నాయి. అలాగే రెడ్‌మి 10X ప్రో 30X డిజిటల్ జూమ్ మరియు OIS ఫోర్-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Best Mobiles in India

English Summary

Redmi 10X series Launched : Price in India, Specs and More