Tata Sky Broadband లో ఈ కొత్త మార్పులు గమనించారా!!!
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను సవరించింది. అంతే కాకుండా కంపెనీ 300Mbps హై స్పీడ్ తో కొత్తగా మరొక ప్లాన్‌ను ఎంచుకున్న ప్రాంతాలలో ప్రవేశపెట్టింది. ఇండియాలో సుమారు 20 కి పైగా నగరాల్లో తమ సర్వీసులను అందిస్తున్న పాన్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం ఉన్న అపరిమిత ప్లాన్ ల మీద రూ.50 ధరను పెంచింది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క లిమిటెడ్ GB ప్లాన్‌లను కూడా సంస్థ తన సమర్పణలలో నాలుగు స్థాయిలకు తగ్గించింది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌లో జరిగిన కొత్త మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Jio-KKR Deal: జియో ప్లాట్‌ఫామ్‌లో KKR ₹11,367కోట్ల పెట్టుబడులు..

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 300Mbps ప్లాన్
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు కొత్తగా 300Mbps ప్లాన్‌ను నెలకు రూ.1900 ధర వద్ద అందిస్తున్నది. ప్రస్తుతం ఉన్న అపరిమిత ప్రణాళికలు 1500GB FUP ని కలిగి ఉండగా 300 Mbps కొత్త ప్లాన్‌లో డేటా యొక్క FUP పరిమితి 3300GB లేదా 3.3TB ఉంటుంది. FUP పరిమితి ధాటిని తరువాత వినియోగదారులు 2 Mbps వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించవచ్చు. Samsung Outdoor TV: కొత్త రకం స్మార్ట్ టీవీకి శ్రీకారం... ఇక మేడ మీద కూడా చూడవచ్చు

300Mbps ప్లాన్ వార్షిక చందా
టాటా స్కై యొక్క ఈ 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఆరు నెలల మరియు వార్షిక ప్యాక్‌ల సభ్యత్వంతో కూడా వినియోగదారులు పొందవచ్చు. వినియోగదారులు 300 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ యొక్క సెమీ వార్షిక ప్యాక్‌ను 10% తగ్గింపుతో రూ.9720 ధర వద్ద పొందవచ్చు. అలాగే 15% తగ్గింపుతో ఈ 300 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ యొక్క వార్షిక ప్యాక్‌ను రూ.18,360 ధర వద్ద పొందవచ్చు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ రౌటర్
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన అన్ని ప్లాన్‌లకు ఉచిత రౌటర్‌ను అందిస్తుంది. అలాగే మూడు నెలలు, ఆరు నెలలు లేదా వార్షిక ప్యాక్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులకు ఉచిత ఇన్‌స్టాలేషన్ కూడా అదనంగా అందించబడుతుంది. టాటా స్కై యొక్క 25 ఎమ్‌బిపిఎస్, 50 ఎమ్‌బిపిఎస్ మరియు 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌ల యొక్క ధరలు వరుసగా రూ.950, రూ.1050 మరియు రూ.1150 గా ఉన్నాయి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 25Mbps ప్లాన్
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క బేస్ 25Mbps ప్లాన్ యొక్క ఆరు నెలల ప్యాక్‌కు చందా పొందిన వినియోగదారులు రూ .4860 చెల్లించాల్సి ఉండగా, వార్షిక ప్యాక్ కోసం రూ .9180 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ యొక్క సెమీ వార్షిక సభ్యత్వాన్ని పొందడానికి వినియోగదారులు రూ.5400 చేయవలసి ఉంది. అలాగే వినియోగదారులు 50 Mbps ప్లాన్ యొక్క వార్షిక చందాను రూ.10,200 ధర వద్ద పొందవచ్చు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ GB ప్లాన్‌లు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క స్థిర జిబి ప్లాన్‌లను రెండు 50 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌లు మరియు రెండు 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌లతో సహా నాలుగు అంచెలుగా తగ్గించారు. 150 జిబి డేటా పరిమితితో బేస్ 50 ఎమ్‌బిపిఎస్ ప్లాన్‌కు నెలకు రూ .790 ధర ఉండగా, టాప్ టైర్డ్ ప్లాన్‌కు 500 జిబి డేటా పరిమితితో రూ .1000 ధర నిర్ణయించారు. కంపెనీ తన అన్ని స్థిర జిబి ప్లాన్‌లలో డేటా రోల్‌ఓవర్ ఎంపికను అందిస్తుంది, ఇది వినియోగదారులు ఉపయోగించని డేటాను వచ్చే నెలకు తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications








