Samsung Outdoor TV: కొత్త రకం స్మార్ట్ టీవీకి శ్రీకారం... ఇక మేడ మీద కూడా చూడవచ్చు


శామ్‌సంగ్ సంస్థ స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా టీవీలలోను మంచి బ్రాండుగా పేరును పొందింది. ఇప్పటి వరకు ఈ సంస్థ అనేక రకాల మోడల్లలో తమ టీవీలను విడుదల చేసింది. ఇంటి యొక్క పైభాగంలో స్నేహితులతో కలిసి టీవీలలో సినిమాలను చూడాలని చాలా మందికి కోరికగా ఉంటుంది.

Advertisement

కానీ అది గది యొక్క బయట భాగం కావడంతో తమ టీవీలను అక్కడ ఉంచడానికి సంకోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అటువంటి సమస్యలకు పరిష్కారం కోసం శామ్‌సంగ్ కొత్తగా ది టెర్రేస్ అనే టీవీ‌ను ప్రకటించింది. 4K QLED ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు సౌండ్‌బార్ ను కూడా కలిగి ఉన్న మొట్టమొదటి బహిరంగ టీవీ ఇదే కావడం గమనార్హం. ఇండోర్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని బయటికి తీసుకురావడానికి శామ్‌సంగ్ సంస్థ ప్రత్యేకంగా టెర్రేస్ స్మార్ట్ టివిని రూపొందించింది. ఈ స్మార్ట్ టీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.  Airtel Xstream Premium: లైవ్ ఛానెల్‌లు మరింత పెరిగాయి.. అలాగే మరొక గొప్ప ఫీచర్!!!

Advertisement
Samsung Outdoor TV లభ్యత

శామ్‌సంగ్ సంస్థ యొక్క ది టెర్రేస్ స్మార్ట్ టీవీ మోడల్ మొదట యుఎస్ మరియు కెనడాలో ప్రారంభించబడుతోంది. అలాగే ఈ సంవత్సరంలోనే జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా విడుదల కానుంది. శామ్‌సంగ్ టెర్రస్ స్మార్ట్ టీవీ మోడల్ వ్యాపారాల కోసం ప్రొఫెషనల్ మోడల్‌లో కూడా త్వరలో ప్రారంభించబడుతుంది. Motorola Edge+ స్మార్ట్‌ఫోన్ లాంచ్... డిస్కౌంట్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ ది టెర్రేస్ స్మార్ట్ టీవీ యొక్క వినియోగదారు మోడల్ 55-అంగుళాల, 65-అంగుళాల మరియు 75-అంగుళాలు వంటి మూడు పరిమాణాలలో ప్రారంభించబడింది. దీనిని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని IP55 రేటింగ్‌తో రూపొందించబడింది. ఈ స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే నీరు మరియు ధూళికి వ్యతిరేకంగా వాతావరణ-నిరోధకతను కలిగి ఉండడమే కాకుండా 59.8mm మందమైన మరియు సొగసైన డిజైన్‌తో వస్తుంది.  Tata Sky, Airtel Digital TV వినియోగదారులకు గొప్ప శుభవార్త... విద్యారులకు ముఖ్యంగా

OTT యాప్ లు

శామ్‌సంగ్ సంస్థ యొక్క ది టెర్రేస్ స్మార్ట్ టీవీలో సాధారణ శామ్‌సంగ్ స్మార్ట్ టివి యొక్క ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి. ఇది శామ్‌సంగ్ టివి ప్లస్, 120 కి పైగా ఛానెల్‌లతో ఉచిత లీనియర్ టివి వీడియో సర్వీస్, శామ్‌సంగ్ హెల్త్, ఫిట్‌నెస్ మరియు వెల్నెస్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులను అందించే OTT యాప్ లను కూడా ముందే ఇంస్టాల్ చేయబడి ఉంటాయి. Jio-KKR Deal: జియో ప్లాట్‌ఫామ్‌లో KKR ₹11,367కోట్ల పెట్టుబడులు..

మల్టీ ఫీచర్స్

మల్టీ వ్యూ మరియు ట్యాప్ వ్యూ వంటి మొబైల్ వీక్షణ సామర్థ్యాలకు మద్దతు ఇవ్వడంతో పాటు, ది టెర్రేస్ బిక్స్బీ, అమెజాన్ అలెక్సా మరియు త్వరలో ప్రారంభించబోయే గూగుల్ అసిస్టెంట్‌ వంటి పలు వాయిస్ సేవలకు కూడా ఇది మద్దతును ఇస్తుంది. ఇది సహజంగా స్మార్ట్ హోమ్ పర్యావరణ వ్యవస్థకు సరిపోయేలా సహాయపడుతుంది.

కనెక్టివిటీ ఎంపికలు

శామ్‌సంగ్ టెర్రేస్‌ స్మార్ట్ టీవీలో వైఫై మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని సహాయంతో ది టెర్రేస్ సౌండ్‌బార్ మరియు ఇతర సౌండ్ పరికరాలతో కూడా జత చేయడానికి అనుమతిస్తుంది. టెర్రేస్ సౌండ్‌బార్ పరిసర వాతావరణంతో సంబంధం లేకుండా వాటర్ రెసిస్టెన్స్ టెక్నాలజీను కలిగి ఉంది. IP55 స్థాయి మన్నికను కలిగి ఉన్న ది టెర్రేస్ సౌండ్‌బార్‌ను గోడకు లేదా నేరుగా ది టెర్రేస్ టీవీకి కూడా అమర్చవచ్చు. శామ్సంగ్ ది టెర్రేస్‌ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అన్న దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Best Mobiles in India

English Summary

Samsung Launched Terrace Outdoor 4K QLED TV