Tata Sky, Airtel Digital TV వినియోగదారులకు గొప్ప శుభవార్త... విద్యారులకు ముఖ్యంగా

|

భారత ప్రభుత్వం దేశంలోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలుచేయడానికి 12 కొత్త స్వయం ప్రభా ఛానెళ్లను ప్రసారం చేయడానికి టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వంటి డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

MHRD

MHRD

స్వయం ప్రభా అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) ప్రారంభించిన ఛానెళ్ల సమూహం. ఇది డిటిహెచ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యా విషయాలను బోధించడం కోసం అంకితం చేయబడింది. పాఠశాల విద్యను బోధించడం కోసం ప్రభుత్వం ఏప్రిల్‌లో కేటాయించిన మూడు ఛానెళ్లకు అదనంగా కొత్త ఛానెల్‌లు ఉన్నాయని సీతారామన్ అన్నారు. ఏప్రిల్‌లో MHRD ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) మూడు ఛానెళ్ల ద్వారా విద్యా విషయాలను లైవ్ రూపంలో పంపిణీ చేసింది. Realme Narzo 10 Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లతో నేడే ప్రారంభం..

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో 12 కొత్త విద్యా ఛానెల్‌లు

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో 12 కొత్త విద్యా ఛానెల్‌లు

గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలోని పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడానికి ఇది చాలా సహాయకరంగా ఉంటుందని అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే గ్రామీణ లేదా పట్టణాలతో సంబంధం లేకుండా పిల్లలు ప్రస్తుతం టెక్నాలజీని అధికంగా ఇష్టపడుతున్నారు. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రవేశపెట్టబోయే 12 కొత్త ఛానెళ్ల ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ సెషన్లను ప్రసారం చేయడానికి ప్రభుత్వం నిబంధనలు చేసిందని సీతారామన్ చెప్పారు. Airtel, Vodafone, Jio: 3GB డేటాతో పాటు అధిక ప్రయోజాలను ఇస్తున్న టెల్కో ఇదే...

డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌
 

డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌

ప్రాంతీయ విద్యా విషయాల కోసం నాలుగు గంటలు కేటాయించడంతో ఈ ఛానెళ్లలో ప్రసార సమయాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇంకా 12 స్వయం ప్రభా ఛానెళ్లను డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రవేశపెట్టడం వల్ల ఈ ఛానెళ్ల విస్తరణ పెరుగుతుందని హైలైట్ చేశారు.

డిష్ టివి మరియు డి 2 హెచ్ లలో కూడా 12 కొత్త విద్యా ఛానెల్‌లు ప్రసారం

డిష్ టివి మరియు డి 2 హెచ్ లలో కూడా 12 కొత్త విద్యా ఛానెల్‌లు ప్రసారం

డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు పోటీగా ఉండే సంస్థలలో డిష్ టివి మరియు డి 2 హెచ్ లు కూడా ఉన్నాయి. ఇవి తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేస్తున్నాయి. టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలను సీతారామన్ ప్రత్యేకంగా హైలైట్ చేసినప్పటికీ డిష్ టివి మరియు డి 2 హెచ్ సహా ఇతర ఆపరేటర్లు కూడా రాబోయే నెలల్లో ఈ ఛానెల్‌లను ప్రసారం చేయవచ్చు.

డిటిహెచ్ -MHRD

డిటిహెచ్ -MHRD

ఏప్రిల్‌ నెలలో టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మొదట్లో పాణిని, శారదా మరియు కిషోర్ మంచ్‌ వంటి విద్య ఛానెల్‌లను ప్రసారం చేసినప్పటికీ తరువాత డిష్ టివి మరియు డి 2 హెచ్ కూడా చాలా తక్కువ వ్యవధిలోనే తమ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఛానెల్‌లను ప్రసారం చేయడానికి అంగీకరించాయి. అదనంగా ఈ మూడు ఛానెల్‌లు DD- DTH మరియు JioTV యాప్ లలో కూడా అందుబాటులో ఉంచబడ్డాయి.

స్వయం ప్రభా ఛానెళ్ల ప్రసారం

స్వయం ప్రభా ఛానెళ్ల ప్రసారం

స్వయం ప్రభా ఛానెళ్లను ప్రసారం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం తమ ఇళ్లలో ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులకు కూడా విద్యను పొందడానికి సహాయపడేలా రూపొందించినట్లు ఏప్రిల్‌లో MHRD హైలైట్ చేసింది. ఈ ఛానెళ్లలోని కార్యక్రమాలు తక్కువ గ్రేడ్‌లలోని విద్యార్థులతో పాటు 11 మరియు 12 గ్రేడ్‌లలోని విద్యార్థులకు కూడా GSAT-15 ఉపగ్రహం ద్వారా ప్రసారం చేయనున్నాయి. ప్రతిరోజూ నాలుగు గంటల పాటు కొత్త కంటెంట్‌ను ప్రసారం చేసే విధానాన్ని ఛానెల్‌లు అనుసరిస్తాయని చెబుతారు. రిపీట్ టెలికాస్ట్‌లు విద్యార్థులకు కొత్త కంటెంట్‌ను వారి సౌలభ్యం మేరకు చూడటానికి బహుళ సమయ స్లాట్‌లను అందిస్తాయని తెలిపారు.

Best Mobiles in India

English summary
Tata Sky, Airtel Digital TV Now Provides Government 12 New Education Channels

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X