వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

Written By:

స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాట్సప్..వాట్సప్ అంటూ కలవరిస్తున్నారు.. అది అండ్రాయిడ్ మొబైల్ అయితే దానిలో వాట్సప్ ఉండాల్సిందే.. అయితే అలాంటి వాట్సప్‌లో ఇప్పుడు కొన్ని క్రేజీ ఫాక్ట్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి చాలా ఫన్నీగా ఉండటలమే కాకుండా ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. అవేంటో మీరే చూడండి.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అయిదుగురి వర్కర్లు.. 100 కోట్ల డౌన్‌లోడ్స్

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

గత ఏడాది మార్చినాటికి 100 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కేవలం ఐదుగురే పని చేస్తున్నారు. ఈ ఐదుగురిలో కంపెనీ అధినేత బ్రియాన్ ఒకరు

వాట్సప్‌కో ఫౌండర్స్‌కు నో చెప్చిన ఫేస్‌బుక్, ట్విటర్

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ గతంలో యాహూలో పనిచేశారు. వీరిద్దరూ ఫేస్‌బుక్, ట్విటర్ ఇంటర్వ్యూలకు వెళ్ళారు. కానీ ఆ ఇంటర్వ్యూల్లో నెగ్గలేకపోయారు. ఆ తర్వాత వాట్సప్‌ సహ వ్యవస్థాపకులుగా మారారు.

ఇమేజెస్, వీడియోలను కంప్రెస్ చేసుకోవచ్చు

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

పిక్చర్స్, వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించిన తర్వాత ఆండ్రాయిడ్‌లోని వాట్సప్ మీడియా ఫోల్డర్‌లో చూస్తే కంప్రెస్ అయిన వెర్షన్లు కనిపిస్తాయి. అయితే క్వాలిటీ తగ్గుతుంది. కానీ త్వరగా మెసేజ్ పంపించడానికి వీలవుతుంది.

యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

వాట్సప్‌లో ఓపెన్ మెసేజింగ్ స్టాండర్డ్ ఎక్స్ఎంపీపీ కస్టమైజ్డ్ వెర్షన్‌ ఉంది. యూజర్ అకౌంట్‌ను ఫోన్ నంబరు@ఎస్.వాట్సాప్.నెట్ రూపంలో క్రియేట్ చేస్తుంది.

మీరు పంపిన మెసేజ్‌ను ఎప్పుడు చదివారో తెలుసుకోవచ్చు

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

ఏదైనా మెసేజ్‌ను పంపించినపుడు అది డెలివరీ అయినట్లు సమాచారం వస్తుంది. దానిని రిసీవర్ ఎప్పుడు చదివారో తెలుసుకోవాలంటే ఆ మెసేజ్‌‌‌పై నొక్కి పట్టి ఉంచి‘ఇన్ఫో'ను సెలెక్ట్ చేసుకుంటే మేసేజ్ స్టేటస్, ఎప్పుడు చదివారు అనే అంశాలను తెలుసుకోవచ్చు.

టెక్స్ట్ ఫార్మాటింగ్ - బోల్డ్, ఇటాలిక్

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

వాట్సప్‌ ఈ సదుపాయాన్ని మార్చి నుంచి కల్పించింది. ఏదైనా టెక్స్ట్ బోల్డ్‌గా కనిపించాలంటే దానిని ఆస్టెరిస్క్‌ల మధ్యలో ఉంచాలి.ఇటాలిక్స్‌లో ఉండాలంటే అండర్‌స్కోర్ చేయాలి. టిల్డీల మధ్యలో టైప్ చేసిన అక్షరాలు స్ట్రైక్‌త్రూ అవుతాయి. ఈ మూడింటిని కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు.

యూజర్ డేటాను స్టోర్ చేయదు

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

వాట్సాప్‌ ద్వారా పంపిన మెసేజ్‌లను సర్వర్‌లో స్టోర్ చేయదు. అన్‌డెలివర్డ్ మెసేజ్‌లను మాత్రమే క్యూలో ఉంచుతుంది. డివైస్‌కు మెసేజ్ డెలివరీ అయిపోయిన తర్వాత వాట్సాప్ సర్వర్లలో ఆ మెసేజ్ ఉండదు. మీకు బ్యాకప్ కావాలంటే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ ద్వారా ఆ పని చేసుకోవచ్చు.

ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

వాట్సప్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ బటన్ తీసుకొచ్చింది.ఈ ఆప్సన్ ద్వారా ఒకరి మెసేజ్ లను మరొకరు ఓపెన్ చేయలేరు.

కష్టమ్ నోటిఫికేషన్స్

వాట్సప్ క్రేజీ ఫాక్ట్స్ ఇవే

ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు మీ రింగ్ టోన్ లను గ్రూప్ లో చేంజ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Crazy WhatsApp Facts You Probably Didnt Know
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting