మెసేంజర్‌లో ఇవి కూడా చేయవచ్చు

Written By:

2016న జులైలో ఫేస్ బుక్ మెసేంజర్ ను విడుదల చేసినప్పటినుంచి ప్రతి నెలా అది వన్ మిలియన్ కష్లమర్లతో దూసుకుపోతోంది. కంపెనీకి ఇప్పటికే రెండు మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ లు ఉన్నాయి. వాటిల్లో వాట్సప్ ఇప్పటికే వన్ బిలియన్ యూజర్లను దాటేసింది.అయితే ఫేసబుక్ ప్రధానంగా మెసేంజర్ మీద బాగా దృష్టి పెట్టింది. కొత్త ఫీచర్లను మార్కెట్‌లోకి వదిలేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే మెసేంజర్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. వాటిలో మీకు తెలియని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

జియోని ఢీ కొడతారా..చతికిల బడతారా: రేసులో ఆరుమంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 సెకండ్ల వీడియో

దీనిలో ఒక్క మెసేజ్ లు మాత్రమే కాకుండా 15 సెకండ్ల వీడియో కూడా పంపుకోవచ్చు.ఇందుకోసం మీరు కెమెరా బటన్ ని ట్యాప్ చేసి షట్టర్ బటన్ నొక్కితే వీడియో రికార్డవుతుంది.

బోట్స్

ఈ ఫీచర్ ని కొత్తగా ప్రవేశపెట్టింది.త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వెదర్ రిపోర్ట్ ,హెల్త్ రిపోర్ట్ తెలుసుకోవచ్చు.

చెస్ గేమ్

మీకు బోర్ కొడుతున్నప్పుడు మీరు చెస్ గేమ్ కూడా ఇందులో ఆడుకోవచ్చు.దీనికోసం మీరు '@fbchess' అనిటైప్ చేస్తే చాలు. అది మీరు వెళ్లాలనుకుంటే తప్ప ముగింపుకు రాదు.

హిడెన్ బాస్కెట్ బాల్ గేమ్

హిడెన్ బాస్కెట్ బాల్ గేమ్ కూడా ఇందులో ఉంది. మీరు బాస్కెట్ బాల్ ఎమోజి సెండ్ చేయగానే గేమ్ స్టార్టవుతుంది. మీరు స్కీన్ టాప్ చేయడం ద్వారా గేమ్ ఆడుకోవచ్చు.

Soccer game!

యూరో కప్ 2016 సమయంలో ఈ గేమ్ ని డెవలప్ చేశారు. ఇది కూడా మీరు బాస్కెట్ బాల్ టైప్ లోనే Soccer బాల్ ఎమోజిని పంపి స్టార్ట్ చేసుకోవచ్చు.

గ్రూప్ కన్వర్షన్ పిన్

ఈ ఫీచర్ చాట్ అప్లికేషన్స్ లో లభ్యం కావడం లేదు. అయితే మెసేంజర్ లో ఈ ఆప్సన్ ఉంది. మీరు గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ సెక్షన్ ని మూడు డాట్స్ బటన్స్ నొక్కడం ద్వారా పిన్ చేసుకోవచ్చు.

క్యాబ్ బుక్

మీరు ఈ ఫీచర్ ని కూడా ఉపయోగించుకోవచ్చు

చెల్లింపులు

మీరు ఇందులో లావాదేవీలు కూడా జరుపుకోవచ్చు. ఇందుకోసం మీరు డాలర్ బటన్ నొక్కడం ద్వారా తరువాత వచ్చే సూచనలు పాటిస్తూ మనీ పంపుకోవచ్చు.

ఢిపాల్ట్ మెసేజ్

రీసెంట్ గా ఫేస్ బుక్ ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. మీరు ఇలా కూడా యాప్ ని సెట్ చేసుకోవచ్చు

మ్యూట్ కన్వర్షన్

వాట్సప్ తరువాత ఇందులోనే ఆఫీచర్ ఉంది. మీకు ఎటువంటి అంతరాయం లేకుండా మెసేంజర్ ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు. ఏది మ్యూట్ లో పెట్టాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే చాలు. మ్యూట్ ఆప్సన్ కనిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
10 Hidden Facebook Messenger Features You Need to Know Read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting