ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయట

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ దానిలో డేటా ఉంటే చాలు..ఇప్పుడు హ్యాపీగా గడిపేయవచ్చు.

|

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ దానిలో డేటా ఉంటే చాలు..ఇప్పుడు హ్యాపీగా గడిపేయవచ్చు. అన్నపానీయాలు లేకపోయినా 24 గంటలు దానితోనే గడిపేస్తుంటారు చాలామంది. ఇక సోషల్ మీడియాతో పాటు అన్నిరకాల డిజిటల్ వాడకానికి స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ సాధనం అయిపోయింది. ఇక ఆత్మీయులతో మాట్లాడటానికి, క్యాబ్ బుకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌ ఇలా ఇంట్లో కూర్చునే పనులు పూర్తి చేయాలంటే అందుకు సంబంధించిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌ అన్నే' నివేదిక-2018 ప్రకారం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ల వాడకంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌లలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక మంది డౌన్‌లోడ్‌ చేస్తున్న టాప్‌- 10 యాప్‌లపై ఓసారి లుక్కేద్దాం.

Gmail నుంచి నమ్మశక్యం కాని ఫీచర్లు, భద్రతకే పెద్ద పీటGmail నుంచి నమ్మశక్యం కాని ఫీచర్లు, భద్రతకే పెద్ద పీట

apps

1. ఫేస్‌బుక్‌
దీని మీద ఈ మధ్య ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా ఫేస్‌బుక్‌ అగ్రస్థానంలో నిలిచింది.
2. యూసీ బ్రౌజర్‌
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ను వెనక్కి నెట్టి యూసీ బ్రౌజర్‌ రెండో స్థానంలో నిలిచింది. ఫాస్ట్‌ బ్రౌజింగ్‌, డాటా సేవింగ్‌ వంటి ఫీచర్ల వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి యూజర్ల సంఖ్య పెంచుకోగలిగింది
3.వాట్సాప్‌
ప్రస్తుతం ఉన్న మెసేజింగ్‌ యాప్‌లన్నింటిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాట్సప్‌.
4. ఎఫ్‌బీ మెసెంజర్‌
గతేడాది నాల్గో స్థానంలో నిలిచిన ఎఫ్‌బీ మెసెంజర్‌ ఇప్పుడు కూడా అదే స్థానంలో కొనసాగుతోంది.
5.షేర్‌ ఇట్‌
వివిధ డివైస్‌ల మధ్య ఫైళ్లు, ఫొటోలు షేర్‌ చేసుకోవడాన్ని సులభతరంగా మార్చిన షేర్‌ ఇట్‌ యాప్‌ ఐదో స్థానం సంపాదించింది.

రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?
6.జియో టీవీ
గతేడాది చివరి స్థానంలో నిలిచిన జియో టీవీ ఈసారి ఆరో స్థానానికి ఎగబాకింది. సీరియల్స్‌, క్రికెట్‌ మ్యాచులు చూసేందుకు వీలుగా రూపొందిచబడిన ఈ యాప్‌ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.
7.ఎయిర్‌ టెయిల్‌ టీవీ
తక్కువ ధరకే డేటాను అందించడం ద్వారా ఎయిర్‌టెల్‌ టీవీ యూజర్ల సంఖ్యను పెంచుకొని ఏడో స్థానంలో నిలిచింది.
8.హాట్‌ స్టార్‌
స్టార్‌ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన హాట్‌ స్టార్‌ మొదటిసారిగా మోస్ట్‌ డౌన్‌లోడెడ్‌ యాప్‌ల జాబితాలో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది.
9.ట్రూకాలర్‌
రాంగ్‌ కాల్స్‌ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్‌ యాప్‌కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతేడాది ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ యాప్‌ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
10. హైప్‌స్టార్‌
వీడియో కమ్యూనిటీ యాప్‌ హైప్‌స్టార్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఒకే క్లిక్‌తో వైరల్‌ వీడియోలు చూసేయొచ్చు. గతేడాది టాప్‌ 10లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ యప్‌ ఈసారి పదో స్థానంలో నిలిచింది.ఈ టాప్‌- 10 యాప్‌లు మీ మొబైల్‌లో కూడా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోండి మరి.

Best Mobiles in India

English summary
Here are 10 of the most popular apps that the Indians are downloading write now.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X