వాట్సప్‌లో నంబర్ బ్లాక్ చేస్తే..

Written By:

వాట్సప్ ఇప్పుడు చాలా పాపులర్ అయిన యాప్..ఇందులో మీరు కాలింగ్ తో పాటు మెసేజ్ ఛాటింగ్ కూడా చేసుకోవచ్చు.. అయితే ఈ వాట్సప్ లో కొంతమంది అదే పనిగా మెసేజ్ లు చేస్తూ విసిగిస్తుంటారు. అలాంటి వారి పోరు భరించలేక చాలామంది వారిని బ్లాక్ చేస్తుంటారు. అయితే ఇలా బ్లాక్ చేసిన తరువాత మీరు కొన్ని విషయాలను గమనించుకోవాలి. అవేంటో ఓ సారి చూద్దాం.

భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వారికి మెసేజ్ చేస్తే అది డెలివరీ కాదు

బ్లాక్ చేసిన నంబర్లకు మీరు ఏదైనా మెసేజ్ చేస్తే అది వారికి చేరదు. అలాగే వారి నుంచి వచ్చే ఎటువంటి మెసేజ్ మీకు కనిపించదు.

చివరిసారి మెసేజ్ ఎప్పుడు చూసారో తెలియదు

బ్లాక్ చేసిన కాంటాక్ట్స్‌లో చివరిససారిగా ఎప్పుడు మెసేజ్ పంపారు లేకుంటే రీసీవ్ చేసుకున్నారు అనేది కనిపించదు.

స్టేటస్ మెసేజ్ కనిపించదు

మీరు వారి స్టేటస్ మెసేజ్ చూడాలంటే అదికనిపించదు. వారు మిమ్మల్ని చూడాలన్నా చూడలేరు.

ప్రొఫైల్ పిక్చర్ కూడా చూడలేరు.

మీ ప్రొఫైల్ పిక్చర్ ఏముందనేది కూడా వారు చూడలేరు.

కాల్స్

బ్లాకింగ్ కాంటాక్ట్స్‌లో మీరు ఎటువంటి కాల్స్ చేయలేరు అలాగే రిసీవ్ చేసుకోలేరు.

మెసేజ్‌లు చదవలేరు

వారు పంపిచిన మెసేజ్‌లు మీకు అసలు కనిపించవు. అవి డెలివరీ అయినట్లు బ్లూ మార్క్ లో కనిపించినా కూడా చదవలేరు.

గ్రూప్ లో కూడా చూడలేరు

ఎవరైనా కాంటాక్ట్స్‌ని బ్లాక్ చేసినప్పుడు వారు గ్రూప్ లో ఏ మెసేజ్ పంపినా చూడలేరు. అందరూ చూస్తారు కాని బ్లాక్ చేసిన వారు చూడలేరు.

రిమూవ్ చేయలేరు

మీరు దాన్ని వాట్సప్ లో రిమూవ్ చేయాలంటే ముందు మీ ఫోన్ బుక్ నుంచి గాని లేకుంటే అడ్రస్ బుక్ నుంచి గాని డిలీట్ చేయాలి.

అంతా మీ చేతిలో

సో ఇంత తతంగం ఉంది కాబట్టి మీరు బ్లాక్ చేసే ముందు ఓ సారి ఆలోచించుకోండి. వారు మిమ్మల్ని భారీ స్థాయిలో విసిగిస్తుంటే మాత్రమే వారిని బ్లాక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things That’ll happen if you block someone on WhatsApp read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting