భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
ఈ-కామర్స్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్ అంటూ కష్టమర్ల ముందుకు రాబోతోంది. గాంధీ జయంతి సంధర్భంగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు చేపట్టనున్నమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఇప్పటికే రెండు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ ముచ్చటగా మూడోసారి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మరి ఈ ఫెస్టివల్ హైలెట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.
ఉచిత డేటా ఆఫర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు..ధర కూడా తక్కువే

కన్సూమర్ ప్రొగ్రామ్స్ కింద
ఎలాంటి ఈఎమ్ఐ ధరలు లేకుండా ఉత్పత్తులు అందించడం, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ వంటి వాటిని కన్సూమర్ ప్రొగ్రామ్స్ కింద ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాలు చేపట్టనుంది.

రెవెన్యూలను ఆర్జించే లక్ష్యంగా
ఆన్‌లైన్ అమ్మకందారులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో పాటు, రెవెన్యూలను ఆర్జించే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్స్ కంపెనీకి దోహదం చేయనున్నాయి.

అనేక ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు
ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు అనేక ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించనుంది.

80 ప్లస్ ప్రొడక్ట్ కేటగిరీలు
80 ప్లస్ ప్రొడక్ట్ కేటగిరీలు, మంచి ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం అందించడం. వాటిపై కష్టమర్లు ఊహించని డిస్కౌంట్లు అందించడం.

తక్కువ ధరలకే ప్రీమియం ఉత్పత్తులను
ఎలక్ట్రానిక్ ఉపకరణలు, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో ప్రత్యేక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం, ఫలితంగా తక్కువ ధరలకే ప్రీమియం ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం జరుగుతుంది.

ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్స్‌కు
దీంతో పాటు ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్స్‌కు ప్రత్యేక ఆఫర్లు, అదనంగా 10 శాతం వరకు పొదుపు లాంటి ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించనుంది.


Click it and Unblock the Notifications








