ఒక్కరోజులో 1400 కోట్ల మెసేజ్‌లు

Written By:

ఇండియాలో సాంప్రదాయ మొబైల్ ఎసెమ్మెస్‌లకు కాలం చెల్లింది. కంపెనీలను కోట్ల నష్టాలలో ముంచెత్తుతూ వాట్సప్ సునామిని సృష్టిస్తోంది. కొత్త సంవత్సరం వేళ అదీ డిసెంబర్ 31వ తేదీన 100 కోట్ల మెసేజ్ లు వెళ్లాయి. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల హవా పెరుగుతుందనడానికి ఇది ఓ నిదర్శనం. ఆ ఒక్క రోజే 310 కోట్ల ఇమేజెస్, 70 కోట్ల జిఫ్స్, 61 కోట్ల వీడియోలు షేర్ చేసుకున్నారు. వాట్సప్ చరిత్రలో ఇది అసాధారణమని ఆ సంస్థే ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

310 కోట్ల డాలర్ల ఆదాయాన్ని

వాట్సప్‌పైనే జనం ఎక్కువగా ఆధారపడటంతో సాంప్రదాయ ఎస్సెమ్మెస్లు వాడకం భారీగా తగ్గిపోయి టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రెవెన్యూ కోల్పోతున్నాయి. రీసెర్చ్ కంపెనీ ఓవమ్ ప్రకారం 2016 వరకే టెలికాం కంపెనీలు 310 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయి.

వాట్సప్పైనే ఎక్కువగా

పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలన్నా .. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువులతో ఎప్పుడూ కనెక్టయి ఉండాలన్నా వాట్సప్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ఊహించినదాని కంటే ఎక్కువ ఆదాయం

వాట్సప్ అందరికీ సౌకర్యవంతంగా, వేగంగా, నమ్మకంగా ఉంది అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల 2017 లో ఊహించినదాని కంటే ఎక్కువ ఆదాయం వాట్సప్ సొంతం కానుంది.

రష్యా కంటే ఎక్కువ జనాభా

ఫేస్బుక్ ఆధీనంలో ఉన్న ఈ సంస్థకు ఇప్పటివరకు భారత్లోనే 16 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అంటే ఇది రష్యా కంటే ఎక్కువ జనాభా.

రాను రాను వాట్సప్ మరో చరిత్ర

దీంతో దేశంలో తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకొనే వీలు వాట్సప్‌కు కలిగింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇండియాలో విస్తరిస్తున్న నేపథ్యంలో రాను రాను వాట్సప్ మరో చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
160 million Indians sent 14 billion WhatsApp messages on New Year eve read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot