సాఫ్ట్‌వేర్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

Written By:

సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనుకునే వారికి నైపుణ్యాలు చాలా ముఖ్యమని అందరికీ తెలిసిన విషయమే. సాఫ్ట్‌వేర్ గా జాబ్ సాధించాలంటే ఎన్నో కోర్సులు మరెన్న నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆంగ్లం మీద పట్టు ఉంటేనే ఆ రంగంలో రాణించేందుకు వీలు ఉంటుంది. ఇందుకోసం చాలామంది మంచి పేరున్న ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయి నిపుణుల దగ్గర గెడైన్స్ తీసుకుంటారు. అయితే ఇంగ్లీష్ మీద కొంచెం పట్టున్న వారికి ఆన్ లైన్ లోనే ఈ కోర్సులు ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఉంది.

రూ. 2000కే స్మార్ట్‌ఫోన్ అమ్మాలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కోడ్ అకాడమి (Www.codecademy.com)

HTML, CSS, జావా స్క్రిప్ట్, j క్వెరీ, PHP, పైథాన్, రూబీ, SQL తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను ఈ సైట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆయా కోర్సులను నేర్చుకోవాలంటే యూజర్లు ఇందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ది కోడ్ ప్లేయర్ (http://thecodeplayer.com)

HTML5, CSS3, జావాస్క్రిప్ట్ వంటి కోర్సులను ఇందులో నేర్చుకోవచ్చు. పలువురు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడిన కొన్ని సింపుల్ ప్రాజెక్ట్లను ఇందులో అందిస్తున్నారు. దీని ద్వారా యూజర్లు వాటిని సులువుగా నేర్చుకునేందుకు వీలుంది.

రూబీ కోన్స్ (http://rubykoans.com)

రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ వెబ్సైట్ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. రూబీ లాంగ్వేజ్, సింటాక్స్, స్ట్రక్చర్, ఫంక్షన్లు, లైబ్రరీలు వంటి ఎన్నో అంశాలను ఇందులో నేర్చుకోవచ్చు.

స్టాక్ ఓవర్ఫ్లో (http://stackoverflow.com)

సి, సి ++, సి #, j క్వెరీ, పైథాన్, CSS వంటి కోర్సులను దీంట్లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ యూజర్లకు ఉచితంగా లభిస్తున్నాయి. దీంతోపాటు ఇందులోని డెవలపర్లు, యూజర్లకు కనెక్ట్ అవడం ద్వారా వారి సలహాలు, సూచనలు, మెళకువలను తెలుసుకునేందుకు వీలుంది.

మొబైల్ టట్స్ ప్లస్ (http://code.tutsplus.com)

వెబ్ డెవలప్మెంట్, వర్డ్ ప్రెస్, మొబైల్ డెవలప్మెంట్, PHP, ఫ్లాష్, జావా స్క్రిప్ట్, iOS SDK, CMS తదితర కోర్సులను దీంట్లో అభ్యసించవచ్చు. ట్యుటోరియల్స్, ఆర్టికల్స్, టిప్స్, వీడియోలు ఇలా ఆయా సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Top 5 Websites to Learn Coding (Interactively) Online read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting