మీ మెదడు పరిగెత్తడానికి ఈ యాప్స్ చాలు

Written By:

మీ మెదడు చురుకుగా పనిచేయాలనుకుంటున్నారా..దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్నారా. పని ఒత్తిడి వల్ల కొంచెమైనా రిలీఫ్ కావాలనిపిస్తుందా..అయితే మీకోసం కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి..వాటితో మీ మెదడు అపరిమిత వేగంతో పరిగెడుతుంది. అవేంటో మీరే చూడండి.

ట్విట్టర్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లూమోసిటీ ( Lumosity)

న్యూరో సైంటిస్టులు ఈ యాప్‌ను రూపొందించారు. యూజర్ల మెమరీని పెంచుతూ, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి, యూజర్లకు అనుగుణంగా ఆలోచించడంలో లుమోసిటీ యాప్ పని చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్‌ను 70 మిలియన్ యూజర్లు వాడుతున్నారు.

విజార్డ్ ( Wizard)

ఈ యాప్‌ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు, గేమ్ డెవలర్స్, మనోవైకల్యం కలిగిన వారు కలిసి రూపొందించారు. విజార్డ్ యాప్ యూజర్లు ఒక ప్రత్యేక కార్యక్రమంపై అందరికీ ఒకేలా మెమరీ కలిగి ఉండేలా సహకరించడంతో పాటు, మనోవైకల్యం కలిగిన వారి దైనందిన జీవితంలో ఉపయోగపడేలా దీన్ని తయారుచేశారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్( Fit Brains Trainer)

వేగవంతంగా ఆలోచించడానికి ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్ యాప్ ఎంతో సహకరిస్తుంది. 360 గేమ్స్, పజిల్స్ తో కూడిన ఈ యాప్, యూజర్ల బ్రెయిన్‌కు పదునుపెట్టేలా చేస్తుంది.

ఇడెటిక్‌ ( Eidetic)

ఇంపార్టెంట్‌ ఫోన్‌ నెంబర్లు నుంచి సన్నిహితుల బర్త్‌డేల వరకు ఏ వాస్తవం గుర్తుంచుకోవాలన్నా ఈ యాప్ భలే సహాయ పడుతుందట. ఇతరాత్ర భాషలు నేర్చుకోవడానికి కూడా ఈ ఇడెటిక్ సూపర్‌గా ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలివేట్‌ ( Elevate )

2014లో ఎలివేట్ యాప్‌ను లాంచ్ చేశారు. మెమొరీ, మ్యాథ్స్‌, ఏకాగ్రతతో పాటుగా ఇతర మెంటల్‌ స్కిల్స్‌ను పరీక్షించే 30 రకాల గేమ్స్‌ దీనిలో ఉన్నాయి.

బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ ( Brain Trainer Special)

మాథమేటికల్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడం నుంచి సుడోకో‌లు ఆడటం వరకు ఎంపిక చేసిన గేమ్స్ అన్నింటినీ ఇది ఆఫర్ చేస్తుంది. బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ యాప్ యూజర్లు ఏ అంకెలనైనా వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి, మెదడును ఓ మంచి రూపంలో తయారుచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మైండ్ గేమ్స్ (Mind Games)

ఈ యాప్ పూర్తిగా ఉచితం. వెంటనే మెమరీని పెంచడం, పదసామాగ్రిని యూజర్లలో విస్తృతపరచడానికి ఇది ఎంతో సహకరిస్తోందట.

హ్యాపీఫై ( Happify)

సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఎక్కువ పాజిటివ్‌గా ఆలోచించాలనుకుంటున్నారా? అయితే హ్యాపీఫై మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతుందట. దీనిలో రిలాక్సేషన్, మెడిటేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Some research indicates that cognitive training carried out using apps can improve your brain health read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot