ట్విట్టర్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు

By Hazarath
|

మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజాలు మొదట్లో చూపించిన ఆసక్తి ప్రస్తుతం కనబరచడం లేదని తెలుస్తోంది. తనను తాను అమ్మకానికి పెట్టుకున్న ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ట్విట్టర్ ను కొనేందుకు పలు దిగ్గజ సంస్థలు లైన్లో నిలిచి వున్నాయని తొలుత వార్తలు రాగా, ఒక్కో సంస్థా వెనక్కు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడే రేసులో ఏ కంపెనీ కూడా లేని పరిస్థితి.

ఐఫోన్ 7 తక్కువ ధరకే కావాలా..అయితే వీటిపై ఓ లుక్కేయండి

మైక్రోసాప్ట్

మైక్రోసాప్ట్

మైక్రోసాప్ట్ ఇటీవలే లింక్డ్‌ఇన్ కొనుగోలుచేయడంతో, మరో భారీ డీల్ అవసరం లేదని తప్పుకున్నట్టు సమాచారం.

గూగుల్ కూడా

గూగుల్ కూడా

ప్రస్తుతం గూగుల్ కూడా ఎందుకు ఈ రేసు నుంచి వైదులుగుతుందో సరియైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఐఫోన్ దిగ్గజం ఆపిల్ కూడాఈ రేసులో పాల్గొనడం లేదని రీకోడ్ రిపోర్టు వెల్లడించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాల్ట్ డిస్నీ కూడా

వాల్ట్ డిస్నీ కూడా

ఇప్పుడు వాల్ట్ డిస్నీ కూడా ట్విట్టర్ తమకు వద్దని తేల్చి చెప్పింది. డిస్నీ వెనక్కు వెళ్లడంతో ట్విట్టర్ ఈక్విటీ వాటాల విలువ 17 శాతం దిగజారింది. అయితే ఈ నెలలోనే ట్విట్టర్ అమ్మకం పూర్తవుతుందని రిపోర్టులు కూడా వెల్లడవుతున్నాయి.

సేల్స్ ఫోర్స్'

సేల్స్ ఫోర్స్'

ఇప్పుడు ఈ రేసులో మిగిలివున్నది ఒక్క 'సేల్స్ ఫోర్స్' మాత్రమే. త్రైమాసిక ఫలితాలను ట్విట్టర్ ఈ నెల 27న ప్రకటించనుండగా, ఆ తరువాత మాత్రమే ఓ ఆఫర్ ఇవ్వాలన్నది సేల్స్ ఫోర్స్ ఆలోచనగా తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మకపు వార్తతో

అమ్మకపు వార్తతో

అమ్మకపు వార్తతో అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ఎగిసిన ట్విట్టర్ షేర్లు.. ప్రస్తుతం గూగుల్ కూడా బిడ్స్ దాఖలు చేయడం లేదని రీకోడ్ రిపోర్టు చేయడంతో ఆ కంపెనీ షేర్లు 9 శాతం కిందకి దిగజారాయి.

కంపెనీ అమ్మకపు చర్చలు

కంపెనీ అమ్మకపు చర్చలు

సమర్థవంతమైన కొనుగోలుదారులతో కంపెనీ అమ్మకపు చర్చలు తుదిదశకు వచ్చాయని ట్విట్టర్‌కు చెందిన అధికారులు పేర్కొంటున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Best Mobiles in India

English summary
Sources: Google will not make a Twitter bid and Apple is also an unlikely suitor read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X