2జిబి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌తో Airtel మరో సంచలనం

By Hazarath
|

ఎయిర్‌టెల్ తమ కష్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. మై ఎయిర్‌టెల్ యాప్ లో సరికొత్త ఫీచర్ ఎయిర్‌టెల్ బ్యాకప్‌ని జోడించింది. ఈ ఫీచర్ లో భాగంగా 2జిబి వరకు మీరు స్గోరేజ్ ని ఉచితంగా వాడుకోవచ్చు. ఇది కేవలం ఎయిర్‌టెల్ కష్టమర్లకు మాత్రమేనని కంపెనీ చెబుతోంది.

రూ. 25కే 1జిబి డేటా..ఆఫర్ ఎక్కడంటే ?

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా మీరు ఉచితంగా 2జిబి క్లౌడ్ స్టోరేజ్ ని అందుకోవచ్చు. ఈ స్టోరేజ్ లో మీరు ఫోటోలు, అలాగే కాల్స్ వివరాలు, ఫైల్స్, ఆడియో, వీడియోలాంటివన్నీ భద్రపరుచుకోవచ్చు.

ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు

ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు

ఇది ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నఎయిర్‌టెల్ కష్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఐవోఎస్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీనికోసం ఎయిర్‌టెల్ కష్టమర్లు

దీనికోసం ఎయిర్‌టెల్ కష్టమర్లు

దీనికోసం ఎయిర్‌టెల్ కష్టమర్లు మై ఎయిర్‌టెల్ యాప్ లేటెస్ట్ వర్షన్ (v4.1.3)ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. అది డౌన్ లోడ్ అయిన తరువాత అక్కడ పాప్ అప్ నోటిఫికేషన్ దగ్గర ఎయిర్‌టెల్ బ్యాకప్ ఆప్సన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్ డేట్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

క్లౌడ్ ఐకాన్ ఓపెన్ చేయగానే

క్లౌడ్ ఐకాన్ ఓపెన్ చేయగానే

క్లౌడ్ ఐకాన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఆప్సన్ కనిపిస్తుంది. మీరు మీ ఫైల్స్ ని బ్యాకప్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యాప్ ప్రతిరోజూ 1am to 5am మధ్యలో ఆటోమేటిగ్గా మీ ఫైల్స్ ను స్టోరేజ్ లోకి పంపిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్‌టెల్ నైట్ ప్లాన్

ఎయిర్‌టెల్ నైట్ ప్లాన్

ఈ టైం అనేది చేంజ్ కాదు. దీంతో పాటు ఎయిర్‌టెల్ నైట్ ప్లాన్ లో భాగంగా యూజర్స్ 50 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది.అయితే ఈ బ్యాకప్ లో కేవలం కాంటాక్ట్స్ , ఫైల్స్ మాత్రమే భద్రపరుచుకోవడం మేలు. వీడియోస్కి, మ్యూజిక్ కి స్పేస్ సరిపోదు.

ఇప్పటికే ఈ ఫీచర్ ని

ఇప్పటికే ఈ ఫీచర్ ని

అయితే ఇప్పటికే ఈ ఫీచర్ ని గూగుల్ అలాగే ఆపిల్ కంపెనీలు ప్రవేశపెట్టాయి. అయితే ఎయిర్‌టెల్ మాత్రం మరిన్ని అప్ డేట్స్ తో ఈ పీచర్ ని ముందుకు తెస్తామని చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Airtel Introduces 2GB of Free Cloud Backup with myAirtel App read more at telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X