ఏపీ పర్స్ రెడీ, అదనపు ఆదాయం సంపాదించుకోండి

Written By:

నవ్యాంధ్ర డిజిటల్ ఆంధ్రాగా మారేందుకు దారులు ఏర్పడుతున్నాయి. నోట్ల రద్దుతో ఏపీ ప్రజలు కష్టాలను ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సరికొత్తగా ఏపీ పర్స్ పేరుతో మొబైల్ యాప్ రిలీజ్ చేశారు. యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఇది ప్రపంచంలోనే తొలి యాప్ అంటూ ఏపీ సీఎం కొనియాడారు. మరి యాప్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

చివరి రోజు స్నాప్‌డీల్ భారీ తగ్గింపులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్ నుండి

ముందుగా ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. లింక్ కోసం క్లిక్ చేయండి.

మీ పేరు , ఫోన్ నంబర్, ఆధార్ నంబర్

యాప్ డౌన్ లోడ్ అయిన తరువాత మీ పేరు , ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేయగానే మీ ఫోన్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అది ెంటర్ చేయగానే దానికి కింద referral code ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పడే మీరు లాగిన్ కాగలరు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొత్తం 13 బ్యాంకుల యాప్స్

ఇందులో మొత్తం 13 బ్యాంకుల యాప్స్ ఉంటాయి. వాటిని మళ్లీ మీరు స్పెషల్ గా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 10 ఈ వ్యాలెట్ యాప్ లు ఉంటాయి. వీటి ద్వారా లావాదేవీలు మీరు జరపవచ్చు.

పనిచేసేవారికి అదనపు ఆదాయం

ఈ యాప్ ప్రచారం కోసం పనిచేసేవారికి అదనపు ఆదాయం కూడా లభించనుంది. ఈ యాప్ కోసం పనిచేసే ఉద్యోగులను మార్పు నేస్తంగా పిలుస్తామని సీఎం చెబుతున్నారు.

ఆదాయ మార్గం ఇలా..

ఇక ఎవరైనా ఈ యాప్ ను ఇతరుల ఫోన్లలో డౌన్ లోడ్ చేయిస్తే వారికి రూ. 15 లభిస్తుంది.దీంతో పాటు ఏడు నగదు రహిత లావాదేవీలు చేయిస్తే రూ. 20 ఇస్తారు. దీంతో పాటు బ్యాంకర్లు కూడా మీకు 15 రూపాయిలు ఇస్తాయి.

నెలకు రూ .4 - 5 వేల ఆదాయం

ప్రజలకు .. డిజిటల్, ఫైనాన్షియల్ అక్షరాస్యత కల్పించేందుకు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దీనిపై పనిచేయాలని తద్వారా వారికి నెలకు రూ .4 - 5 వేల ఆదాయంతోపాటు, కమ్యూనికేషన నైపుణ్యాలు పెరుగుతాయని సీఎం చెబుతున్నారు.

గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా మారిస్తే

దీంతోపాటు గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా మారిస్తే అదనపు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. రెండువేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ .15 వేలు, 2-5వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ .25 వేలు, 5-10వేల మధ్య జనాభా ఉన్న గ్రామాలకు రూ .50 వేలు, 10 వేల పైన ఉన్న జనాభాకు లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Andhra Pradesh govt launches ‘AP Purse’ app to boost cashless transactions read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot