గూగుల్ నుంచి మరో సంచలనం, ఇండియాకి వస్తోంది

Written By:

పెద్వ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీససుకున్న నిర్ణయం డిజిటల్ పేమెంట్లను లాభాల బాటలోకి నడిపిన ససంగతి తెలిసిందే.. మోడీ నిర్ణయంతో క్యాష్ లెస్ డిజిటల్ పేమెంట్ల ప్రాముఖ్యత భారత్ లో విపరీతంగా పెరిగింది. అప్పటివరకు భారత్ లో డిజిటల్ పేమెంట్లపై దృష్టిపెట్టని దిగ్గజ కంపెనీలన్నీ ప్రస్తుతం వీటిపై ఫోకస్ చేశాయి. ఈ బాటలో ఇప్పుడు గూగుల్ కూడా వస్తోంది.

ఔరా..ఆపిల్ ఏం ప్లాన్ వేసింది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ పే

ఇటీవలే స్మార్ట్ ఫోన్ల రారాజు శాంసంగ్ ఇండియాలో 'శాంసంగ్ పే' ఫ్లాట్ ఫామ్ ను లాంచ్ చేయగా.. ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ సైతం 'ఆండ్రాయిడ్ పే' ఫ్లాట్ ఫామ్ ను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది.

ఆండ్రాయిడ్ పే డిజిటల్ వాలెట్

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ తో తన ఆండ్రాయిడ్ పే డిజిటల్ వాలెట్ టెస్టింగ్ ను భారత్ లో గూగుల్ ప్రారంభించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

ఆండ్రాయిడ్ పే

అమెరికా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, పోలాండ్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, జపాన్, బెల్జియంలలో ఇప్పటికే ఆండ్రాయిడ్ పే అందుబాటులో ఉండగా.. ఇటీవలే రష్యాలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

ఆండ్రాయిడ్ పే సర్వీసులను గూగుల్ 2015లో

ఆండ్రాయిడ్ పే సర్వీసులను గూగుల్ 2015లో విడుదల చేసింది. భారత్ లో ఆండ్రాయిడ్ పే సర్వీసుల లాంచింగ్ రిపోర్టుపై స్పందించిన కంపెనీ అధికార ప్రతినిధి యూజర్లు తమ మొబైల్ డివైజ్ ల ద్వారానే సులభతరంగా పేమెంట్లు జరుపుకునేందుకు మార్గాలను తాము అన్వేసిస్తున్నామని తెలిపారు.

సామర్థ్యాన్ని మరింత పెంచుతామని...

ఇప్పటికే ఆండ్రాయిడ్ పే సర్వీసులను కొన్ని దేశాల్లో అందిస్తున్నామని, తమ సామర్థ్యాన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు.

మెసేజింగ్ యాప్ వాట్సప్ కూడా

200 మిలియన్ యూజర్లు కలిగిఉన్న మెసేజింగ్ యాప్ వాట్సప్ కూడా యూపీఐ పేమెంట్ సొల్యుషన్ తో ఇంటిగ్రేట్ అయి, యూజర్లు తమ కాంటాక్ట్స్ కు సులభతరంగా నగదు పంపించుకునే మార్గాలను అన్వేసిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Pay could come to India soon as trials with UPI integration underway: Report Readvmore at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot