ఆ వాట్సప్ వీడియో లింకు ఓపెన్ చేయకండి !

వాట్సప్ వీడియో కాల్ పేరుతో మీ మొబైల్‌కి వచ్చే లింక్స్ ఓపెన్ చేస్తున్నారా..అయితే బీకేర్ పుల్

By Hazarath
|

ఈ మధ్య వాట్సప్ వీడియో కాలింగ్ పీచర్ ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇది ఆటోమేటిగ్గా వాట్సప్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. ఆలోమేటిగ్గా అప్ డేట్ అయింది కూడా..అయితే వాట్సప్ వీడియో కాలింగ్ అలా వచ్చిందో లేదో అప్పుడే స్పామ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాట్సప్ వీడియో లింక్ ఇదే. క్లిక్ చేసి వాట్సప్ వీడియో కాలింగ్ పొందండంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఇవి ఓపెన్ చేస్తే మీరు చాలా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2017లో దిగ్గజాలకు సవాల్ విసిరే శాంసంగ్ ఫోన్లు

.వాట్సప్ పేరుతో ఓ లింక్

.వాట్సప్ పేరుతో ఓ లింక్

స్పామ్ మెసేజ్ ఎలా ఉంటుందంటే..వాట్సప్ పేరుతో ఓ లింక్ పంపిస్తారు. మీరు వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్ పొందాలంటే ఈ లింక్ క్లిక్ చేయండని చెబుతారు. అలాగే అందరికీ దీన్ని పంపమని కూడా చెబుతారు.

క్లిక్ చేయగానే

క్లిక్ చేయగానే

అయితే ఇది క్లిక్ చేయగానే మీకు వాట్సప్ లాగానే లింక్ కనిపిస్తుంది .ఇందులో మీకు గ్రూప్ కి సంబంధించిన వీడియో కాలింగ్ ఆప్సన్ కనిపిస్తుంది. అందులో మీకు వీడియో కాల్ మీ మొబైల్ లో యాక్టివేషన్ అయిందని చెబుతారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూజర్ వెరిఫికేషన్ అంటూ

యూజర్ వెరిఫికేషన్ అంటూ

యూజర్ వెరిఫికేషన్ అంటూ మళ్లీ ఓ మెసేజ్ వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తరువాత నలుగురు ఫ్రెండ్స్ కి దీన్ని పంపించమంటూ మెసేజ్ వస్తుంది. ఈ లింక్ షేర్ చేస్తే మీకు వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్ వస్తుందని చెబుతారు

ఇది ఫేక్ మెసేజ్

ఇది ఫేక్ మెసేజ్

అయితే ఇది ఫేక్ మెసేజ్..దీన్ని మీరు ఓపెన్ చేస్తే మీ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ఫోన్ లోని వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని తస్కరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాటి జోలికి పోవద్దని

వాటి జోలికి పోవద్దని

ఇలాంటి వాటి జోలికి పోవద్దని వాట్సప్ కూడా చెబుతోంది. ఫోన్లలో వీడియో కాలింగ్ ఆప్సన్ రాకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి వాట్సప్ అప్ డేట్ చేయమని చెబుతోంది. అంతే కాని ఇటువంటి స్పామ్ జోలికి వెళ్లవద్దని కోరుతోంది.

అలాంటి వాటి పేరుతోనే మరొకటి

అలాంటి వాటి పేరుతోనే మరొకటి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన యాప్స్ ని ఫోకస్ చేస్తూ అలాంటి వాటి పేరుతోనే మరొకటి హ్యాకర్లు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి స్పామ్‌లు చాలానే ఉన్నాయి. కాబట్టి వాటికి వీలయినంత దూరంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Beware of WhatsApp video calling invite link, it’s a spam Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X