130 మంది డెడ్, ఆ వీడియో గేమ్ ఆడితే చావే !

Written By:

ఇప్పుడు రెండు దేశాలను ఓ వీడియో గేమ్ హడలెత్తిస్తోంది. రష్యా, సౌదీ అరేబియాలను ఈ వీడియో గేమ్ పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే దీని భారీన పడి 130 మంది రష్యన్ యువతి యువకులు ప్రాణాలు కోల్పోయారు. చూసేందుకు వీడియో గేమ్ లా ఉండే ఈ యాప్ గేమ్ ప్రాణాలను ఇట్టే హరించి వేస్తుంది. ఎలాగో మీరే చూడండి.

మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియో గేమ్ పేరు బ్లూ వేల్‌

ఈ వీడియో గేమ్ పేరు బ్లూ వేల్‌. 10-14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా ఈ గేమ్‌ ను రూపొందించారు. వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని హతమార్చే వీడియో గేమ్ ఇది... స్మార్ట్ ఫోన్ లో దీనిని డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం చిన్న చిన్న సవాళ్లను విసురుతుంది. వాటిని పూర్తి చేసిన తరువాత అసలు కథ మొదలవుతుంది.

గేమ్ స్థానంలో మెంటార్

మీరు టాస్క్ పూర్తి చేశారో లేదో చెప్పాలంటే, మీరు పూర్తి చేసిన టాస్క్ తాలుకు ఫోటోలు దానికి పంపాలి. అవి పంపిన తరువాత మీరు దానికి బానిసయ్యారని తెలుస్తుంది. ఇక గేమ్ స్థానంలో మెంటార్ ఎంటరవుతాడు.

చావు అంచుల దాకా

ఈ మెంటార్ గేమ్ ఆడేవారిని చావు అంచుల దాకా తీసుకువెళతాడు. అర్థరాత్రి భయంగొలిపే చలన చిత్రాలను చూడమంటాడు. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అని బోధిస్తాడు. ఆ తరువాత గాఢనిద్రలో ఉన్న సమయంలో లేవాలని ఆదేశిస్తాడు. చర్మంపై కత్తితో కొన్ని బొమ్మల ఆకారాలను గీసుకోమంటాడు.

రోజుకో టాస్క్ పేరిట 50 రోజులు

సరదాగా నగ్న చిత్రాలను షేర్‌ చేయమంటాడు. ఇవన్నీ టాస్క్ లలో భాగమే.బాయ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ తో డేటింగ్‌ చేయమంటాడు. నిజంగా డేటింగ్ చేశావో లేదో తెలియాలంటే ఆ వీడియోలు, లేదా ఫోటోలు పంపాలని సూచిస్తాడు. ఇలా రోజుకో టాస్క్ పేరిట 50 రోజులు వారిని ఆటాడిస్తాడు. ఈ గేమ్ మత్తులో ఉన్న టీనేజర్లు ఇదంతా గేమ్ లో భాగమని భావిస్తారు.

50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని

కానీ 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో గేమ్, ప్రాణం రెండూ పూర్తవుతాయి. ఇలా ఈ బ్లూవేల్ గేమ్ ఆడి...ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడడంతో రష్యా పోలీసులు దర్యాప్తులో ఈ సంచలన విషయాలు కొనుగొన్నారు.

గేమ్ ఆడేవారికి బెదిరింపు కాల్స్‌

గేమ్ ఆడిని ప్రాణాలు తీసుకోలేదంటే గేమ్ ఆడేవారికి బెదిరింపు కాల్స్‌ వస్తాయి. వారు అప్పటికే టీనేజర్లతో పలు తప్పులు చేయించి ఉంటారు. వారి నగ్న చిత్రాలు.. డేటింగ్‌ వీడియోలు బయటపెడతామని కిడ్నాప్‌ చేసి చిత్ర హింసలకు గురి చేస్తామని బెదిరిస్తారు.

30 మందికిపైగా టీనేజర్ల ఆత్మహత్య

దీంతో భయపడి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల ఈ గేమ్‌ జోలికి ఎవరూ వెళ్లవద్దని మానసికనిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. 130 మందికిపైగా టీనేజర్ల ఆత్మహత్యలకు బ్లూ వేల్‌ గేమ్‌కి లింక్‌ బయటపడటంతో ఈ గేమ్‌ సృష్టికర్త ఫిలిప్‌ బుడేకిన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇతను మానసిక రోగి కావడంతో సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

గేమ్ కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమం

బ్రిటన్‌, దుబాయ్‌, అమెరికా ఇలా చాలా దేశాల్లో తల్లిదండ్రులు బ్లూవేల్‌ వీడియో గేమ్ కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమం చేపట్టారు. ఈ గేమ్‌ ఎంత ప్రమాదమో చెబుతూ ఇతరుల్లో అవగాహన పెంచుతున్నారు. స్కూళ్లు అయితే మీ పిల్లలు బ్లూవేల్‌ గేమ్‌ ఆడకుండా జాగ్రత్తపడాలని'' తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ లు, ఈ మెయిళ్లు, లేఖలు పంపుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beware of this game app which urges you to commit suicide read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot