మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Written By:

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్ల కోసం సమ్మర్ షాపింగ్ డేస్‌ సేల్ ను ప్రారంభించింది. మే 2 నుంచి మే 4 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.

జియో నుంచి ఈ ఏడాది రానున్న మెరుపులు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ

శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 32 జీబీ వేరియెంట్ రూ.18,490 ఉండగా, అదిప్పుడు రూ.14,900 కే లభిస్తోంది. అలాగే 64 జీబీ వేరియెంట్ రూ.16,900 లకు లభ్యమవుతోంది. దీనిపై గరిష్టంగా రూ.16వేల వరకు ఎక్సేంజ్ ధరను కూడా ప్రకటించింది.

శాంసంగ్ ఆన్8

అలాగే శాంసంగ్ ఆన్8 స్మార్ట్‌ఫోన్ 16 జీబీ మోడల్ రూ.13,490 ధరకు లభిస్తోంది. ఎక్సేంజ్‌లో అయితే దీనిపై గరిష్టంగా రూ.12,500 వరకు డిస్కౌంట్ లభ్యమవుతోంది.

మోటో ఎక్స్ ప్లే

మోటో జడ్ 64 జీబీ వేరియెంట్ రూ.39,999కు లభిస్తుండగా, రూ.16,999 ధర ఉన్న మోటో ఎక్స్ ప్లే 16 జీబీ వేరియెంట్ రూ.11,999 ధరకే లభిస్తోంది. 32 జీబీ వేరియెంట్ రూ.13,499 ధరకు లభిస్తోంది.

గూగుల్ పిక్సల్

గూగుల్ పిక్సల్ ఫోన్లపై రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. క్రెడిట్ ,డెబిట్ కార్డు మీద కొన్న వారికి ఈ డిస్కౌంట్ లభిస్తోంది. పిక్సల్ ఫోన్ ధర రూ. 57 వేలు ఉండగా ఇప్పుడు కార్డు మీద కొన్న వారికి రూ. 47 వేలకే లభిస్తోంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఫోన్లపై రూ. 15 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. 64 జిబి మోడల్ ఇప్పుడు రూ. 23,990కే లభిస్తోంది.

టాబ్లెట్లపై కూడా యూజర్లకు డిస్కౌంట్లు

ఇవే కాకుండా ఆపిల్ వాచ్ సిరీస్ 1, శాంసంగ్ గేర్ ఎస్2, మోటో 360 స్పోర్ట్, ఫిట్‌బిట్ చార్జ్ హెచ్‌ఆర్ స్మార్ట్‌వాచ్‌లు, లెనోవో యోగా 3, లెనోవో యోగా ట్యాబ్ 3 ప్రొ, ఆపిల్ ఐప్యాడ్ టాబ్లెట్లపై కూడా యూజర్లకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Flipkart Summer Shopping Days Sale Day 1: Discounts on Smartphones, Tablets, and More read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot