ఆల్ రికార్డ్స్ బ్రేక్.. ఆ యాప్‌ని 1.8 కోట్ల మంది ఇష్టపడ్డారు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ డౌన్‌లోడ్స్ 1.8 కోట్లను అధిగమించాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ డౌన్‌లోడ్స్ 1.8 కోట్లను అధిగమించాయి. సురక్షితమైన త్వరితగతిన క్యాష్‌లెస్ ట్రాన్సక్షన్ల కోసం కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ఈ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.భీమ్ యాప్ అన్ని రికార్డులను బ్రేక్ చేసిందని, యాప్‌ను ఆవిష్కరించిన రోజైన 2016 డిసెంబర్ 30 నుంచి చూస్తే దీని డౌన్‌లోడ్స్ ఇప్పటికే 1.8 కోట్లను అధిగమించాయని, ఇది గో క్యాష్‌లెస్ గో డిజిటల్ కు నాంది అని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విటర్‌లో తెలిపారు. కాగా భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

స్టెప్ 1
ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ట్‌లో కెళ్లి భీమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఐవోఎస్ యూజర్లకి అందుబాటులో లేదు.

స్టెప్ 2
అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత వెరిఫై ఫోన్ నంబర్ అడుగుతుంది. అది ఎసెమ్మెస్ రూపంలో వస్తుంది. అది పూర్తి కాగానే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు వస్తుంది.

స్టెప్ 3
వెరిఫికేషన్ ఫూర్తి కాగానే మీకు 4 డిజిట్ పాస్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 4
పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మీరు ఏ బ్యాంకు నుంచి లావాదేవీలు జరపాలనుకుంటున్నారో ఆ బ్యాంకును సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. బ్యాంకును సెలక్ట్ చేసుకోగానే మీ ఫోన్ నంబర్ ద్వారా వివరాలను ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా మీరు అన్ని రకాల ట్రాన్సిక్షన్స్ చేసుకోవచ్చు.

స్టెప్ 5
యాప్‌లో మూడు రకాల ఆప్సన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో సెండ్, రిక్వెస్ట్, స్కాన్ పే.. ఈ మూడు రకాల ఆప్సన్లలో మీకు కావాల్సినది సెలక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 6
సెండ్ ఆప్సన్‌లో మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వారి ఫోన్ నంబర్ అలాగే ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అమౌంట్ అడుగుతుంది. దీంతో పాటు మీరు ముందు ఎంటర్ చేసిన పిన్ అడుగుతుంది. అవి ఎంటర్ చేయగానే అమౌంట్ ట్రాన్సిక్షన్ జరుగుతుంది.

స్టెప్ 7
అలాగే మీరు ఎవరికైనా అమౌంట్ రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ ఆప్సన్‌లో కెళ్లి మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఆలోమేటిగ్గా వారికి మీ రిక్వెస్ట్ చేరుతుంది. అయితే మీరు ఈ మూడు ఆప్సన్లలో ఏది యూజ్ చేయాలన్నా అవతలి వారు కూడా భీమ్ యాప్ లో లాగిన్ అయి ఉండాలి.

స్టెప్ 8
మూడో ఆప్సన్ బార్ కోడ్ స్కానర్. దీని ద్వారా కూడా అమౌంట్ పంపుకునే వీలు ఉంటుంది. మొబైల్లో గాని , ట్యాబ్లెట్‌లో గాని ఈ యాప్ ఉన్న వారి నుండి యాప్ ఓపెన్ స్కాన్ కోడ్ తీసుకుంటే మీరు ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవచ్చు.


Click it and Unblock the Notifications








