మీ మొబైల్ ఎంత డేంజరంటే...?

Written By:

టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి సెల్‌ఫోన్ లేనిదే బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఒక నిమిషం చేతిలో సెల్‌ఫోన్ లేకుంటే ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. రోజుకి 24 గంటలు మొబైల్ తోనే కుస్తీలు పడుతుంటారు. దీని వల్ల ప్రాణాలకు పెను ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియో తరంగాల శక్తి గుండెకు ప్రమాదమని తాజా అధ్యయనాల్లో తేలింది.

ఉచిత సేవలు కొనసాగుతాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంతానలేమికి కారణం

పురుషులు మొబైల్ విపరీతంగా వాడడం వల్ల వారిలో సెక్స్‌సామర్థ్యం తగ్గిపోతుందని వడోవైక్ అనే ఆరోగ్య సంస్థ చేసిన స్టడీలో తేలింది.

యాక్సిడెంట్లకు కారణం

ప్రతిరోజూ జరిగే రోడ్డుప్రమాదాల్లో నాలిగింట మూడో వంతు మొబైల్ ఆపరేట్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్లే అని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

నిద్ర తగ్గిస్తుంది

నిద్రను మింగేసే స్థానంలో ఒకప్పుడు టీవీ, కంప్యూటర్‌లు ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని మొబైల్స్ ఆక్రమించేశాయి. నిద్రలో ఉన్నప్పుడు సడెన్‌గా కాల్ లేదా మెసేజ్ వస్తే ఉలిక్కిపడి లేచి కాల్ అటెండ్ చేయడం, మెసేజ్‌కి రిైప్లె చేస్తున్నారు. అలా ఉలిక్కిపడి లేవడం వల్ల మెదుడులో రెస్ట్‌మోడ్‌లో ఉన్న నరాలు ఉత్తేజితమై మళ్లీ రెస్ట్‌మోడ్‌కి వెళ్లడానికి టైం తీసుకుంటాయి. ఆలోపు తెల్లవారుతుంది. ఇలా చాలామంది నిద్రలేమితో మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారట

క్యాన్సర్ కారకం

మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ మానవ శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది.మొబైల్ నుంచి విడుదలయ్యే ఎమిట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్స్ అనబడే రేడియో తరంగాలు బేస్ స్టేషన్ నుంచి విడుదలైన రేడియో తరంగాల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటాయి. ఇవి నిత్యం మొబైల్ ఆపరేట్ చేసే వారి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.

కంటి సమస్యలు

మొబైల్ తెరమీద ఎక్కువ సేపు చూడడం వల్ల రెటీనాపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. మొబైల్ లైట్ ఎఫెక్ట్ కంటి శుక్లాల మీద పడి చూపు మందగించడం, కంట్లోంచి నీరు కారడం, ఎక్కువసేపు చూడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వినికడి శక్తి

నిత్యం చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడం, ప్రతి చిన్న విషయానికి కాల్ చేయడం, పడుకునే సమయంలో చెవికి దగ్గరగా మొబైల్ ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Mobile Phones Are Dangerous to Health read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot